Chalo Nalgonda | చలో నల్గొండ బహిరంగ సభను విజయవంతం చేయాలి : బీఆర్ఎస్
Chalo Nalgonda | కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ని వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న చలో నల్గొండ ను విజయవంతం చేయాలని కోదాడ బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు.
నల్గొండ : కృష్ణా నదీ జలాల(( Krishna river water) ) పై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ని వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న చలో నల్గొండ ను విజయవంతం చేయాలని కోదాడ బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. కోదాడ బీఆర్ఎస్ (Kodada BRS) ఇన్చార్జి , మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఎమ్మెల్సీ రవీంద్రరావు (MLC Ravindra Rao) శనివారం కోదాడ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో చలో నల్గొండకు సంబంధించిన వాల్‌పోస్టర్(Wall Poster) ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) నాయకత్వంలో నల్లగొండలో చలో నల్గొండ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ బహిరంగ సభకు కోదాడ నియోజకవర్గ నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. మన నీళ్లు, మన హక్కుల కోసం కేసీఆర్ నాయకత్వంలో కలిసి పోరాడడానికి కదలి రావాలని కోరారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

