మిర్యాలగూడ, ఏప్రిల్ 6 : ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా తెలంగాణ రైతులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. పట్టణ శివారులోని నార్కట్‌పల్లి-అద్దంకి ప్రధానరహదారిపై బుధవారం నిర్వహించిన రాస్తారోకోలో ఆయన పాల్గొని మాట్లాడారు. పంజాబ్‌లో ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ తెలంగాణ రైతులపై కక్షపూరితంగా వ్యవహరించడం తగదన్నారు. కేంద్ర వైఖరిని ముందే గమనించిన సీఎం కేసీఆర్ వరి పంటను తగ్గించాలని రైతులకు సూచిస్తే రాష్ట్రంలోని బీజేపీ నాయకులు తాము కొనుగోలు చేస్తామని చెప్పి నేడు కుంటి సాకులు చెబుతూ రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, చింతా శ్రీనివాసరెడ్డి, చిట్టిబాబునాయక్, నాగార్జునాచారి, మట్టపల్లి సైదులుయాదవ్, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, పాలుట్ల బాబయ్య, మల్లయ్యయాదవ్, కుర్ర విష్ణు, రంగారెడ్డి, మదార్బాబా, మజీద్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దవూర : తెలంగాణలో పండించిన యాసంగి ధాన్యం కొనుగోలు చేసేదాకా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుడే అని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జడ్చర్ల- కోదాడ, సాగర్- హైదరాబాద్ హైవేలపై నిర్వహించిన రహదారుల దిగ్భందంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరుగని అభివృద్ధి తెలంగాణలో జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం జీర్జించుకోలేక పోతుందన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయం చేయడంతో పాటు నీటి వసతి, 24 గంటల విద్యుత్ ఇవ్వడంతో రాష్ట్రంలో పంటల సాగు పెరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, పీఏసీఎస్ చైర్మన్ గుంటక వెంకట్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గజ్జెల లింగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవినాయక్, సుంకిరెడ్డి వెంకట్‌రెడ్డి, వర్ర వెంకట్‌రెడ్డి, గంగాభవాని, మల్గిరెడ్డి లింగారెడ్డి, షేక్ అబ్బాస్, కర్నాటి వెంకట్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, కామర్ల జానయ్య, షేక్ బషీర్ పాల్గొన్నారు.
దామరచర్ల : కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్బంగా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ డి. నారాయణరెడ్డి మాట్లాడుతూ కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరే విధానాలతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయక పోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, రైతులు, సర్పంచులు, ఎంసీటీసీలు పాల్గొన్నారు.