దేవరకొండ, సెప్టెంబర్ 25 : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతాయని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి దేవరకొండ పట్టణంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవరకొండ పట్టణంలో అక్రమ రవాణా, దొంగతనాలు జరగకుండా సీసీ కెమెరాల ద్వారా గుర్తించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుదర్శన్, మాజీ చైర్మన్ నరసింహ, పున్న వెంకటేశ్వర్లు, హనుమంతు వెంకటేష్ గౌడ్, అరుణ సురేష్ గౌడ్, కుర్ర రామ్ సింగ్ పాల్గొన్నారు.