– పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ రఘునందన్
మునుగోడు, మార్చి 24 : గ్యాస్ కు నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే క్రిమినల్ కేసుల నమోదు తథ్యం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసీల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళవారం మునుగోడులో గ్యాస్ కు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న సాయి దుర్గ గ్యాస్ ఏజెన్సీ వారిని ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ వసూలు చేసే గ్యాస్ మాఫియాపై ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వినియోగదారులకు ఆయన తెలిపారు. ఎండలో గ్యాస్ వినియోగదారులను నిరీక్షణ చేయించడం భావ్యం కాదని పేర్కొన్నారు.