నల్లగొండ: నకిరేకల్ మండలం చందరంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఊహించని విధంగా డ్రైవర్ అదుపు తప్పిన ఒక కారు రోడ్డుపై బోల్తాపడింది. ఆ తర్వాత కాసేపటికే కారులో భగ్గుమంటూ మంటలు అంటుకున్నాయి.
ఈ మంటల చెలరేగడంతో చూస్తుండగానే కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వీరిద్దరూ కూడా సమయస్ఫూర్తిగా ఆలోచించడంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.