‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ఫేం శ్రీధర్ గాదె దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్నది. వెంకట్ తలారి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఈశ్వర్ రాచిరాజు, నందు, నిఖిత ప్రధానపాత్రధారులు. పూజిత పొన్నాడ, సింధు కాసారం ఇతర పాత్రధారులు. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఇందులో నర్తకి పాత్రను పూజిత పొన్నాడ పోషిస్తున్నది.
సోమవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమాలోని ఆమె పాత్రకు చెందిన ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. రాజభవనంలో నర్తకీమణిగా మస్తాబైన పూజిత పొన్నాడను ఈ పోస్టర్లో చూడొచ్చు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే హారర్ సినిమా ఇదని, సరికొత్త కథ, కథనాలతో సినిమా ఆకట్టుకుంటుందని, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ చెప్పారు.