దర్శకుడిగా అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూనే తెరపై నటుడిగా కూడా మెప్పిస్తుంటారు బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్. మహారాజ, రైఫిల్క్లబ్ వంటి దక్షిణాది చిత్రాల్లో ఆయన పండించిన విలనీకి మంచి మార్కులు పడ్డాయి. చిరంజీవి తాజా చిత్రం ‘కాకా’ ద్వారా ఆయన తెలుగు తెరపై ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆయన ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నట్లు చిత్రబృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న షూటింగ్లో ఆయన ప్రధాన తారాగణంతో కలసి పాల్గొంటున్నారని మేకర్స్ తెలిపారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న భారీ స్థాయిలో ఈ సినిమా విడుదలకానుంది. అనశ్వర రాజన్, అనురాగ్కశ్యప్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్, సంగీతం: తమన్, నిర్మాణం: కేవీఎన్ ప్రొడక్షన్స్, నిర్మాత: వెంకట్ కె నారాయణ, రచన-దర్శకత్వం: బాబీ కొల్లి.