Capitalism System | మిర్యాలగూడ, ఫిబ్రవరి 18 : ప్రపంచంలో పెట్టుబడిదారి వ్యవస్థ (Capitalism System) పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుందని ఎంసీపీఐయూ జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్ అన్నారు. ఇవాళ పట్టణంలోని ఓ హోటల్లో రాష్ట్ర కమిటీ సభ్యురాలు వస్కుల సైదమ్మ అధక్షతన నిర్వహించిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
పెట్టుబడిదారి వ్యవస్థకు పెద్దన్నగా ఉన్న అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా త్వరలో కరెన్సీ ఏర్పాటుకు బ్రిక్స్ దేశాలు పూనుకోవడం, గాజాపై సాగిస్తున్న హత్యాకాండ, యుద్దం ఆపాలని అమెరికా అధ్యక్షుడు నిర్ణయించడం, దానికి రష్యా అధ్యక్షుడితో చర్చలకు పూనుకోవడం.. దినదినం పతనం అవుతున్న సామ్రాజ్యవాద పెట్టుబడిదాదీ వ్యవస్థ పనితీరు గమనించాలని.. దీనికి ప్రత్యామ్నాయంగా వామపక్ష సోషలిస్టు ఆర్థిక ప్రత్యామ్నాయంతో కూడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలు ప్రపంచంలో ఏర్పడుతున్నాయని..ఇటీవల శ్రీలంకలో వచ్చిన వామపక్ష ప్రభుత్వమే నిదర్శనమన్నారు.
ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని బీజేపీ సంకీర్ణ పాలన ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలు ఇచ్చి నియంతృత్వంతో పాలన చేస్తున్నారని అన్నారు. ఆర్ఎస్ఎస్ ఒత్తిడితో దేశంలో రాజకీయ కక్షలు, ప్రశ్నించే గొంతుకలపై భౌతికంగా దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.
రైతు వ్యతిరేక చట్టాలను మళ్లీ పేర్లు మార్చి తేవడం..
జమిలి ఎన్నికల నినాదం ముందుకు తీసుకురావడం, దొడ్డి దారిన రద్దు చేసిన రైతు వ్యతిరేక చట్టాలను మళ్లీ పేర్లు మార్చి ముందుకు తేవడం, వక్ఫ్ ఆస్తులకు వక్ఫ్ బోర్డు నుంచి బయటకు తేవడం, ముస్లీంలపై దాడులకు పూనుకోవడం, ఎన్నికల్లో పోలింగ్ మేనేజ్మెంట్ చేసి ఎన్నికల వ్యవస్థను పూర్తిగా దిగజార్చుతునారని అన్నారు. అమెరికా భారతీయులకు బేడీలు వేసి మన దేశానికి పంపిస్తున్నా.. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా.. పేదలకు వ్యతిరేకంగా ఉందన్నారు. రైతు, కార్మిక, యువజన, విద్యార్థి, మహిళా, సకల వర్గాలకు వ్యతిరేకంగా బడ్జెట్ ఉందన్నారు. రానున్న కాలంలో దేశంలో, రాష్ట్రాల్లో కమ్యూనిస్టు వామపక్ష శక్తులు, లౌకిక శక్తులను ఐక్యం చేయుటకు, ప్రత్యామ్నాయం నిర్మాణం చేయడానికి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. వామపక్ష, కమ్యూనిస్టు, సోషలిస్టు ఆర్థిక విధానం కలిగి, దేశంలో ఉన్న సామాజిక సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేసి ప్రత్యామ్నాయంగా సాగుదామన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్‌రెడ్డి, వస్కుల మట్టయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు పోతుగంటి కాశీ, వనం నజీర్, పెద్దారపు కన, ఎన్.రెడ్డి, హంసారెడ్డి, నర్రా ప్రతాప్, బాపురావు, కనకం సంధ్య, మాలోతు జబ్బార్నాయక్, తాండ్ర కళావతి, సావిత్రి, కంచె వెంకన్న, మేక మోహన్‌రావు, పోతుగంటి కాశీ, రాయబండి పాండురంగాచారి తదితరులు పాల్గొన్నారు.
State Level Select | రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు కోటపల్లి ఆశ్రమ విద్యార్థిని ఎంపిక
Kothagudem | భార్యా పిల్లలను చూడ్డానికి అత్తగారింటికి వెళ్తే.. పెట్రోల్ పోసి నిప్పంటించారు