నల్లగొండ సిటీ, ఏప్రిల్ 01 : క్రెడాయ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ప్రయాణికులకు మజ్జిగ పంపిణీని ఆర్టీసీ నల్లగొండ జిల్లా రీజినల్ మేనేజర్ కె.జానీరెడ్డి బుధవారం ప్రారంభించారు. నల్లగొండ బస్టాండ్ ఆవరణంలో క్రెడాయ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు మజ్జిగ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు బస్టాండ్ నుండి 40 వేల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తారని, వారి దాహార్తిని తీర్చడం కోసం మంచినీళ్లతో పాటు మజ్జిగ పంపిణీ అందిస్తున్నందుకు క్రెడాయ్ ప్రతినిధులు ఆర్టీసీ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమంచి రాజలింగం మాట్లాడుతూ.. ఎనిమిది మంది సభ్యుల సహకారంతో ఈ మజ్జిగ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. దాతలు బండారు ప్రసాద్, ఆమంచి రాజలింగం, బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నాంపల్లి మనోహర్, దూదిపాల వెంకటరెడ్డి, పిల్లి కృష్ణంరాజు యాదవ్, సముద్రాల శ్రీనివాస్ రావు, గంజి రమేష్. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఏచూరి భాస్కర్, ఆర్టీసీ డీఎం రమణ, సభ్యులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీసీ సిబ్బంది బోనగిరి నరేందర్ నాయక్, సద్దాం హుస్సేన్, ఊర శివ సాయి, ప్రయాణికులు పాల్గొన్నారు.