రహీంఖాన్‌పేట స్టేజీ వద్ద బస్సులు ఆపాలి
మండలంలోని రహీంఖాన్‌పేట స్టేజీ వద్ద అన్ని డిపోల ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులను ఆపాలని కోరుతూ శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు.
- అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో
ఆత్మకూరు(ఎం), జూలై 3: మండలంలోని రహీంఖాన్‌పేట స్టేజీ వద్ద అన్ని డిపోల ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులను ఆపాలని కోరుతూ శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. వీరికి బీఆర్ఎస్, బీజేపీ సర్పంచ్‌లు, నాయకులు మద్దతు తెలిపారు. గంట పాటు రాస్తారోకో చేపట్టడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ లక్ష్మీనారాయణ అక్కడకు చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ డీఎంలతో ఎస్ఐ లక్ష్మీనారాయణ ఫోన్లో మాట్లాడించారు.
రహీంఖాన్‌పేట గ్రామంలోని స్టేజీని ఎస్‌ఆర్‌లో నమోదు చేసి బస్సులు ఆపే విధంగా చర్యలు తీసుకుంటామని డీఎంలు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రహీంఖాన్‌పేట స్టేజీ వద్ద బస్సులు ఆపకపోవడంతో పది గ్రామాల ప్రయాణికులు, వ్యాపారులు, విద్యార్థులు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తున్నారని చెప్పారు.
ఇక్కడ బస్సులు ఆపాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో తొర్రూరు, యాదగిరిగుట్ట, సూర్యాపేట డీఎంలకు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు అనేకసార్లు వినతిపత్రాలు అందజేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో సమస్యను పరిషరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, జిల్లా నాయకుడు ఉప్పల ముత్యాలు, మండల కార్యదర్శి మారుపాక వెంకటేశం, కూరెల్ల, రాఘవాపురం, రహీంఖాన్‌పేట, పుల్లయ్ గూడెం, తుకాపురం గ్రామాల సర్పంచ్‌లు గడ్డం ముత్తమ్మ, ఎరుకల యతీశ్వర్గౌడ్, సుధాగాని కళావతి, నర్రాముల రామలింగయ్య, సంఘ పాక శ్రీవాణి, వివిధ పార్టీల నాయకులు ఘనగాని మల్లేశంగౌడ్, మచ్చ గిరి, అశోక్, లింగయ్య, నయీమ్, నరసయ్య, వెంకన్న, రమేశ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indiramma Illu | ఆశలు కూల్చిన ‘ఇందిరమ్మ’!.. పాత ఇల్లు కూల్చేయడంతో నిలువనీడ లేక.. ఖాళీ స్థలంలోనే తల్లి అంత్యక్రియలు!
Thummala Nageshwara Rao | యాసంగిలో వరి వేయొద్దు.. రైతులకు తుమ్మల నాగేశ్వరరావు సూచన
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

