ట్రావెల్ బస్సు దగ్ధం.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెల్మినేడు సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఆ సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు.
- ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు
చిట్యాల, నవంబర్ 11: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెల్మినేడు సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఆ సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. సంఘటనకు సంబంధించి పోలీసులు, సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సోమవారం అర్థరాత్రి ఓ ట్రావెల్స్ బస్సు (విహారి ట్రావెల్స్, బస్సు నం. ఎన్ఎల్ 01 బీ 3250) 29 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి ఏపీలోని నెల్లూరు జిల్లా కందుకూరుకు బయలుదేరింది. బస్సు వెల్మినేడు శివారులోని హైవేపై ఉన్న బస్బే వద్దకు చేరుకోగానే అకస్మాత్తుగా ఇంజిన్లో పొగలు రావటంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే పక్కకు ఆపాడు.
ప్రయాణికులను అప్రమత్తం చేసి, బస్సు దిగాలని హెచ్చరించాడు. దీంతో ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి బయటకు దూకారు. క్షణాల్లో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రా ణాపాయం జరగనప్పటికీ వారి వస్తువులు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినా వారు వచ్చేలోపే బస్సు పూర్తిగా కాలిపోయిపోయింది. సమాచారం తెలిసిన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రెండు ఫైరింజిన్ల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు. ఇంజిన్లో సాంకేతిక సమస్య ఏర్పడి, షార్ట్ సర్యూట్ కావడంతో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

