వరి కొయ్యలను కాలిస్తే ముప్పే
వ్యవసాయంలో ప్రస్తుతం కూలీల కొరత ఉండటంతో రైతులు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. వరి కోతలకు హార్వెస్టర్లను వినియోగిస్తుండటంతో గడ్డి వినియోగం తగ్గిపోయింది. పశుసంపద ఉన్న వారు గడ్డిని సేకరిస్తుండగా మిగతావారు అలాగే పొలంలో వదిలేస్తున్నారు.
అవగాహనలేమితో కొయ్యలు, గడ్డి పొలంలోనే దహనం
భూమిలోని అవశేషాలు, ఖనిజ లవణాలు
నశిస్తాయంటున్న వ్యవసాయ అధికారులు
నూతనకల్, మే 17: వ్యవసాయంలో ప్రస్తుతం కూలీల కొరత ఉండటంతో రైతులు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. వరి కోతలకు హార్వెస్టర్లను వినియోగిస్తుండటంతో గడ్డి వినియోగం తగ్గిపోయింది. పశుసంపద ఉన్న వారు గడ్డిని సేకరిస్తుండగా మిగతావారు అలాగే పొలంలో వదిలేస్తున్నారు. తదుపరి పంటకు పొలాన్ని సిద్ధం చేసే క్రమంలో వరి కొయ్యలతో పాటు, గడ్డిని దహనం చేస్తున్నారు. అన్నదాతలు అవగాహన లోపంతో చేస్తున్న ఈ చర్యతో భూసారానికి ముప్పు పొంచి ఉందని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు.
కలియ దున్నితే ఎన్నో ప్రయోజనాలు
- వరి కొయ్యలు నేలలో కలియదున్నడం వల్ల సేంద్రీయ కర్బన శాతం పెరిగి దిగుబడులు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉంది
- దుక్కి దున్నే సమయంలో సూపర్ ఫాస్పెట్ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది
- కలియ దున్నితే ఎకరాకు దాదాపుగా టన్ను ఎరువు తయారు అవుతుంది
- మొక్కలకు 2 శాతం నత్రజని, 4 శాతం పాస్పరస్ అదనంగా అందిస్తుంది
- జింక్, మాంగనీసు, ఇనుము, కాల్షియం లాంటి సూక్ష్మధాతువులు అంది పంటకు మేలు చేకూర్చుతాయి
- నేలలో కరుగని మూలకాలను అనుకూలంగా మార్చుతుంది. నీటి నిల్వ పెరుగుతుంది
- టన్ను గడ్డి కావాలంటే వరి పెరుగుదలకు 18.9 కిలోల పొటాషియం, 6.2 కిలోల నత్రజని, 1.1కిలోల భాస్వరంతో పాటు కొంత మోతాదులో సూక్ష్మ పోషకాలు అవసరం అవుతాయి. కొయ్యకాళ్లను భూమిలో కలియ దున్నితే గడ్డి ద్వారా పోషకాలు తిరిగి నేలకు చేరుతాయి
- పొలం దున్నే పది రోజుల ముందు గడ్డిని పొలంలో పరిచి నీరు అందించాలి. తర్వాత ఎకరాకు 50 కిలోల సూపర్ పాస్పెట్ చల్లాలి. దీంతో భూమి దెబ్బతినడం నుంచి తప్పించడమే కాకుండా భూమిలో సేంద్రీయ పదార్థాల స్థాయిని పెంచవచ్చు. ఈ పద్థతి పాటించడం వల్ల నీటి నిల్వ చేసుకునే సామర్థ్యం పెరిగి దిగుబడి అవకాశాలు మెరుగుపడుతాయి.
నిప్పు పెట్టడం వల్ల కలిగే నష్టాలు…
- వరి కొయ్యలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది
- విపరీతమైన వేడితో భూమి సారాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా నత్రజని, పాస్పరస్ లాంటి పోషక పదార్థాల శాతం, దిగుబడి
- తగ్గిపోతుంది
- భూమికి పీచు పదార్థంగా ఉపయోగపడే అవశేషాలు కాలిపోతాయి
- పంటలకు అవసరమైన ఖనిజ లవణాలు దెబ్బతింటాయి
- మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోతాయి
- పొలాల్లో తిరిగే పాములు, ముంగీసలు, ఉడుములు, నెమళ్లు, తొండలు ఇలా అనేక రకాల జీవరాశులు చనిపోయే ప్రమాదం ఉంది. దీంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది
- గట్లు, మొరం గడ్డలపై ఉన్న పచ్చని చెట్లు కూడా ఒక్కోసారి బుగ్గిపాలవుతున్నాయి
- ఆలస్యంగా కోతకు వచ్చే పంటలు, కల్లాలు దగ్గరే ఉంటే ధాన్యం కాలిపోయే ప్రమాదం ఉంది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

