మునుగోడు, డిసెంబర్ 25 : వేళ ఏళ్లుగా అణచివేతకు గురవుతున్న వర్గాల ఆత్మగౌరవ ప్రతీక మనుస్మృతి దహనం అని మాల మహానాడు నాయకులు పెరుమాళ్ల ప్రమోద్ కుమార్, బొల్లు సైదులు అన్నారు. మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మనుస్మృతి ప్రతులను గురువారం మాల మహానాడు ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ.. మానవ హక్కుల కోసం సాగిన ఒక చారిత్రాత్మక ధిక్కార స్వరం, చెరువు నీటిని అంటరాని వారు తాగే హక్కు కోసం అంబేద్కర్ సత్యాగ్రహం చేశారన్నారు. మనుషులు తాగే నీటిని జంతువులు తాగొచ్చు కానీ తోటి మనుషులు తాగితే అపవిత్రం అవుతుందనే అవమానీయ ఆలోచన వెనుక మూలాలను అంబేద్కర్ అన్వేషించారని గుర్తుకు తెచ్చారు.
ఆ వివక్షకు మూలమే మనుస్మృతి అని గుర్తించారు. మనుస్మృతిలోని అవమానీయ సూత్రాలు ఎలా అడ్డు పడుతున్నాయో ప్రజలకు ఆనాడు వివరించారు. మనుస్మృతి భారత రాజ్యాంగ రచనకు పునాది అని చెప్పవచ్చు, ఇది ఒక చారిత్రక ఘట్టం కాదు నిరంతర ప్రక్రియ అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లం శివయ్య, బొల్లు రామలింగయ్య, వడ్డేపల్లి దుర్గా ప్రసాద్, బొల్లు పరమేశ్, బసనగర రాములు, పెరుమాళ్ల శ్రీరామ్ కుమార్, ముచ్చపోతుల భరత్, బేరే అశోక్, గాలి జీవన్, సైదులు, గ్రామస్తులు పాల్గొన్నారు.