భువనగిరి అర్బన్, ఏప్రిల్ 17: బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కోరుతూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపడుతున్న పాదయాత్ర ఎర్రటెండలోనూ ఉత్సాహంగా సాగింది. ఈ నెల 15న మత్స్యగిరిలో ప్రారంభమైన యాత్ర గురువారం భువనగిరి, రాయగిరి మీదుగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పాదాల వద్దకు చేరుకున్నది.
ఈ సందర్భంగా భువనగిరిలో జడ్పీ మాజీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి ఆ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద స్వాగతం పలికి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ప్రజల పార్టీ అయిన బీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు.
అనంతరం రాయగిరి వద్ద మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ స్వాగతం పలికి పాదయాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామియాదవ్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లమల్ల కృష్ణ, విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి బురగు నవీన్, కార్యదర్శి ప్రశాంత్, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, మోత్కూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిప్పలపెల్లి మహేంద్ర, నాయకులు సామ రాజేందర్‌రెడ్డి, సందెల సుధాకర్, కుతాడి సురేశ్, కృష్ణ, బూరుగు నవీన్, శిగవెంకట్, నాగారం ప్రశాంత్, అవినాశ్, కృష్ణ, ప్రవీణ్, రవికుమార్, గాజుల నవీన్, హరీశ్, మనోహర్, నరేశ్ పాల్గొన్నారు.