BRSV | రామగిరి, ఫిబ్రవరి 1 : తెలంగాణ ఉద్యమ పితామహుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్టలు ఒక్కసారి కక్ష సాధింపుగానే ఉన్నాయని మహాత్మా గాంధీ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్‌కుమార్ అన్నారు. సిట్ నోటీసులకు నిరసన వ్యక్తం చేసే తరుణంలో నార్కట్‌పల్లి పోలీసులు యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద ఆదివారం అరెస్టు చేసి స్టేషన్ తరలించారు.
ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమయంలో ఈ అరెస్టులు జరగడం ప్రజాస్వామ్యానికి మచ్చ అన్నారు. ప్రశ్నించే హక్కు విద్యార్థుల హక్కు అని, దాన్ని అణచివేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. యూనివర్సిటీ ప్రాంగణంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం తన భయాన్ని బయటపెట్టుకుందని మండిపడ్డారు. నిరసనలంటే ఇంత భయమా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.