యాదగిరిగుట్ట, ఏప్రిల్ 14 : ఈ నెల 27 వరంగల్‌లో నిర్వహించనున్న రజతోత్సవ మహాసభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు దండుగా కదిలిరావాలని, ఈ సభ చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా మహాసభకు తరలివచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు. రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో సోమవారం రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం వద్దకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రను వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ రజతోత్సవ మహాసభకు ప్రతి ఊరు నుంచి తరలిరావాలని కోరారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రైతులు, మహిళలు, వృద్ధులు వివిధ రంగాల వారు సంతోషంగా జీవనం సాగించారని చెప్పారు. రైతు బంధు, ఉచిత విద్యుత్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు, గురుకులాల ఏర్పాటు, దళిత బంధు వంటి కార్యక్రమాలు ప్రజలకు మేలు చేశాయని తెలిపారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రావడంతో పంటలు పుష్కలంగా పండాయని గుర్తు చేశారు.
కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతులు, ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. రేవంత్‌రెడ్డి సర్కారు 16 నెలల్లో కేవలం 6 వేల ఉద్యోగాలిచ్చి 57 వేలు భర్తీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నదని, బీఆర్ఎస్ హయాంలో జారీ చేసిన ఉద్యోగాలకే నియామక పత్రాలు ఇచ్చిందని విమర్శించారు. గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు మాట్లాడుతూ బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని, 33 శాతం రిజర్వేషన్ పేరిట కాలయాపన చేస్తూ మోసం చేస్తున్నదని మండిపడ్డారు.
బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర విజయవంతమైంది. రాయగిరి నుంచి యాదగిరి గుట్ట వరకు 6 కిలో మీటర్ల పాదయాత్రలో సుమారు 1000 మంది విద్యార్థి, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లు, ఒగ్గు డోళ్లు, పటాకుల పేలుళ్ల నడుమ ఎండ వేడిమిని సైతం లేకుండా పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, గొంగిడి మహేందర్‌రెడ్డి, గొర్రెలు మేకల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి పాల్గొని విద్యార్థులకు మద్దుతుగా వారి వెంట నడిచారు.
గులాబీ జెండాలు చేతపట్టి జై కేసీఆర్.. జై జై బీఆర్ఎస్ అంటూ యువత నినాదాలతో మార్మోగించారు. పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గుట్ట వైకుంఠద్వారం వద్ద పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యాదగిరి గుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, మాజీ జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, జిల్లా నాయకులు మిట్ట వెంకటయ్య, ర్యాకల శ్రీనివాస్, మాజీ సర్పంచులు కసావు శ్రీనివాస్‌గౌడ్, తోటకూరి బీరయ్య, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం జిల్లా కో ఆర్డినేటర్లు దేవరపల్లి ప్రవీణ్‌రెడ్డి, ఒగ్గు శివకుమార్, ఆలేరు నియోజకవర్గ విద్యార్థి విభాగం కన్వీనర్ ర్యాకల రమేశ్, ఉపాధ్యక్షుడు రాసాల ఐలేశ్ యాదవ్, సెక్రటరీ జనరల్ మిట్ట అరుణ్, తుపాకుల సాయి, సూదగాని శ్రీకాంత్, రాజేశ్, రఘువరన్, ఒగ్గు నవీన్, ఒగ్గు మల్లేశ్, గ్యాదపాక క్రాంతి, యాదగిరిగుట్ట మండల యువజన విభాగం అధ్యక్షుడు ఎండీ అజ్జు, రాజాపేట మండల యువజన విభాగం అధ్యక్షుడు పల్లె సంతోశ్‌గౌడ్, విద్యార్థి విభాగం మండలాధ్యక్షుడు భగత్ సింగ్, మోత్కుపల్లి నవీన్, బొమ్మలరామారం మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు బాల్ సింగ్, ఆలేరు మండల అధ్యక్షుడు భానుచందర్, బండ జహంగీర్, గుండాల మండల అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి, మహదేవ్, బీఆర్ఎస్ భువనగిరి మండలాధ్యక్షుడు జనగాం పాండు, కుతాడి సురేశ్, భువనగిరి మండల యువజన విభాగం అధ్యక్షుడు నాగేంద్రబాబు, అంకర్ల మురళి, మట్ట ధనంజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.