– సర్పంచ్‌గా పెద్ది నాగమణి ఏకగ్రీవం
కట్టంగూర్, డిసెంబర్ 03 : కట్టంగూర్ మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్ పదవిని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థులుగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పెద్ది నాగమణి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గాదగోని సుజాతతో పాటు వార్డు సభ్యులుగా 8 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం జరిగిన ఉప సంహరణలో సర్పంచ్ అభ్యర్థి గాదగోని సుజాతతో పాటు నలుగురు వార్డు సభ్యుల అభ్యర్థులు తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు. దీంతో సర్పంచ్‌గా పెద్ది నాగమణిమల్లేశ్, వార్డు సభ్యులుగా దాసరి లింగయ్య, దాసరి కళమ్మ, పెద్ది మల్లేశ్, పెద్ది మంజుల ఏకగ్రీవమైనట్లు ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికైన నాగమణిని నకిరేకల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ్మ, బీఆర్ఎస్ నాయకులు పెద్ది బాలనర్సయ్యగౌడ్, గాదగోని మురళితో పాటు పార్టీ నాయకులు, గ్రామస్తులు అభినందించారు.

Kattangur : మల్లారం సర్పంచ్ పదవి బీఆర్ఎస్ కైవసం