తుంగతుర్తి, నవంబర్ 14 : తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు, సాగు నీటిరంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ విద్యాసాగర్ రావు జయంతి సందర్భంగా శుక్రవారం తుంగతుర్తి మండల పరిధిలోని బండారామారంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతానికి కృష్ణా, గోదావరి నది జలాలను ఎలా ఉపయోగించి బీడు భూములను ఎలా సేద్యంలోకి తేవాలనే విషయాన్ని పుణికి పుచ్చుకున్న మహనీయుడు విద్యాసాగర్ రావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ నాయకులు పులుసు ఉప్పలయ్య, కొల్లూరి మహేందర్, చల్ల సైదులు, ఆకారపు అంజయ్య పాల్గొన్నారు.