కోదాడ రూరల్, ఏప్రిల్ 17 : ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం కోదాడ మండల పరిధి గుడిబండ గ్రామంలో మాజీ ఎంపీపీ చింత కవిత రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. ప్రతి గ్రామంలో నాయకులు కార్యకర్తలు సమన్వయంతో సమయానికి సభాస్థలికి చేరుకోవాలని సూచించారు.
పండుగ వాతావరణంలో పార్టీ జెండా దిమ్మలను రంగులతో నింపి జెండా ఎగురవేసి సభకు బయల్దేరాలన్నారు. అనంతరం వరంగల్ సభ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ కోఆర్డినేటర్ కోదాడ ప్రదీప్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శెట్టి సురేశ్నాయుడు, దొంతగాని అప్పారావు, గడుపు శ్రీకాంత్, బాల, బ్రహ్మం, మాజీ పీఏసీఎస్ చైర్మన్ ముత్తవరపు రమేశ్, భిక్షం, కాకుమాను కోటిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
BRS : బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి : కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్