కట్టంగూర్, ఏప్రిల్ 15 : ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. కట్టంగూర్లోని సత్యసాయి ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమ పార్టీగా మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం రాజకీయ పార్టీగా ఎదిగి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేసిందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల ఇబ్బందులను చూసి ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని తెలిపారు.
ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఏడాదిన్నర రేవంత్రెడ్డి పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతో ఉన్నారని చెప్పారు. ఎప్పటికైనా తెలంగాణ రాష్ర్టానికి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. రానున్న రోజులు బీఆర్ఎస్వేనని, పార్టీ నాయకులు, కార్యర్తలు కొంత కాలం ఓపికగా ఉండాలని, ఎవరికీ భయపడొద్దని తెలిపారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
సమావేశంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి వడ్డె సైదిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, నాయకులు గుర్రం సైదులు, దాసరి సంజయ్, గుండగోని రాములు, పెద్ది బాలనర్సయ్య, నకిరేకంటి నర్సింహ, మునుగోటి ఉత్తరయ్య, మంగదుడ్ల వెంకన్న, నోముల వెంకటేశ్వర్లు, దేవరకొండ నరేశ్, చౌగోని జనార్దన్, అంతటి శ్రీను, గుండమల్ల పురుషోత్తం, బీరెల్లి ప్రసాద్, జిల్లా యాదయ్య, జానీ పాష, బెల్లి సుధాకర్, రెడ్డిపల్లి మనోహర్, లింగస్వామి, పోతరాజు నగేశ్ తదితరులు పాల్గొన్నారు.