యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : కేంద్ర సర్కారుపై బీఆర్ఎస్ రణ నినాదం మోగించింది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరు సలిపింది. మోదీ రైతు వ్యతిరేక విధానాలపై కదం తొక్కింది. కాషాయ పార్టీ అనాలోచిత నిర్ణయాలను ఎండగట్టింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కల్లాల డబ్బులను తిరిగి చెల్లించాలని కేంద్రం కపట బుద్ధికి నిరసనగా శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ధర్నాకు రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ప్రసంగించారు. అనంతరం ్ర పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, ప్రజాప్రతినిధులు ఎడ్ల రాజేందర్‌రెడ్డి, నోముల పరమేశ్వర్‌రెడ్డి, నరాల నిర్మల, ఎన్నబోయిన ఆంజనేయులు, చింతల కిష్టయ్య, ఏవీ కిరణ్, పాండు, శ్రీనివాస్‌రెడ్డి, ఓంప్రకాశ్ గౌడ్, లక్ష్మీనారాయణగౌడ్, రమేశ్‌గౌడ్, ర్యాకల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇతర రాష్ర్టాల్లో లేని రికవరీతెలంగాణలోనే ఎందుకు?
భారతదేశంలోనే వరి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉన్నది. చెరువులు, కుంటలు పునరుద్ధరించారు. చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. వాటి ద్వారా భూగర్భ జలాలు పెరిగాయి. రైతులకు సకాలంలో ఎరువులు, పెట్టుబడి సాయం ఇవ్వకుండా చేయాలని కేంద్రం కుట్ర పన్నుతున్నది. ఉపాధి హామీ పథకం కింద కల్లాలు నిర్మిస్తే.. తిరిగి డబ్బులు చెల్లించాలని అడగటం ఎంత వరకు సబబు. రాష్ర్టాల్లో చేపల పెంపకం కోసం కుంటలు నిర్మిస్తే రికవరీ లేదు. ఒక్క తెలంగాణలోనే ఎందుకు? బీఆర్ఎస్ పెట్టాక పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది.
కేసీఆర్ ప్రధాని అవుతారనే భయంతో బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. 40 గ్రామాల సర్పంచులు తెలంగాణలో చేరుతామని, కర్ణాటకలోని రాయచూర్ ఎమ్మెల్యే తెలంగాణ పథకాలు తమ వద్ద అమలు చేయాలని అంటున్నారు. దేశానికి కేసీఆర్ వంటి నాయకుడు కావాలని రైతులంతా కోరుతున్నారు. చేతకాని మోదీ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదు. బీజేపీ కుట్రలతో సీఎం కేసీఆర్ భయపడరు. రాబోయే ఆయన దేశానికి ప్రధాని అవుతారు.
– డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని స్వయంగా సీఎం కేసీఆర్ కేంద్రానికి విన్నవించినా, అసెంబ్లీలో తీర్మానం చేసినా, పార్లమెంట్లో కోరినా పట్టించుకోవడం లేదు. రైతుల కోసం ఏర్పాటు చేసిన కల్లాలకు ఖర్చు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలని కేంద్రం అడుగుతున్నది. ఇంత కంటే సిగ్గుచేటు మరొకటి ఉండదు. ఇది నాలుగున్నర కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.
స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2014, 2019 ఎన్నికల మేనిఫెస్టోల్లో బీజేపీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఆదాయాన్ని రెట్టింపు చేయకపోగా, నష్టాన్ని రెట్టింపు చేసింది. మద్దతు ధర ఇవ్వాలని సీఎం కేసీఆర్ స్వయంగా రోడ్డెక్కి ధర్నా చేసినా పట్టించుకోని దుర్మార్గ ప్రభుత్వమిది. మీటర్లు పెట్టకుంటే ఎఫ్ఆర్బీఎం శాతంలో కోత పెడుతామని బెదిరించారు. కోట్లు కాదు.. రూ.50వేల కోట్ల నష్టం తీసుకొచ్చినా రైతుల బాగు కోసం మోటర్లకు మీటర్లు పెట్టబోమని సీఎం కేసీఆర్ ఘంటాపథంగా చెప్పారు.
మద్దతు ధర ఇవ్వబోమని, ఉచితాలు వద్దని, కరెంట్ ఇవ్వొద్దని, రైతుబంధు వద్దని చెప్తూ కేంద్రం అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నది. కన్న తల్లి ఎంత గొప్పదో.. దేశానికి అన్నం పెట్టే రైతు కూడా అంతే గొప్ప. ప్రధాని మోదీ తన తల్లికి ఎట్ల కాళ్లు మొక్కుతున్నారో.. రైతుకు కూడా మొక్కాలి. ఆ తీరుగా పాలన ఉండాలి. దేశంలో దురదృష్టకమరైన పాలన ఉన్నదని, ఎదురు తిరిగితే ప్రభుత్వాలను ధోరణితో ఉన్నది. చరమగీతం పాడాలి.
– ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
సీఎం కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టే కుట్ర
ఉద్యమ సమయంలో రైతుల ఆత్మహత్యలకు చలించిపోయిన కేసీఆర్.. తెలంగాణ వచ్చాక అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. గతంలో గ్రామాల్లో మంచి నీరు, బోర్లు పోయక పశువులకు నీళ్లు లేక కష్టాలు పడిన పరిస్థితులు చూశాం.. ఇప్పుడు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో సస్యశ్యామలం చేశారు. శంలో 24గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే. గోదావరి మిగులు జలాలను జిల్లాకు మళ్లించారు. వ్యాప్తంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశారు. కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, 24గంటల కరెంట్, రుణమాఫీని చూసి బీజేపీకి భయం పట్టుకుంది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని రైతులు, సంఘాల నేతలు కేసీఆర్‌ను కలుస్తుంటే ఆ పార్టీకి వణుకు పుడుతున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేంద్రం ఉద్దేశపూర్వకంగానే ఇబ్బందులు పెడుతున్నది. భాగంగానే ఐటీ, ఈడీలను రాష్ట్రంపైకి ఉసిగొల్పుతున్నది. సీఎం కేసీఆర్ కుటుంబాన్ని, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కుట్ర చేస్తున్నది. కులం, మతం పేరుతో జనాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ ఒక్కటీ ఇవ్వలేదు. విదేశాల్లో ఉన్న నల్లధనం వెనక్కి రప్పిస్తామని హామీ ఇచ్చి ఒక్క పైసా తేలేదు. ఇలాంటి దుర్మార్గ పాలనకు బుద్ధి చెప్పాలి.
– నకిరేకల్ చిరుమర్తి లింగయ్య
కల్లాల డబ్బులు అడగడానికి సిగ్గుండాలి
రైతుల కోసం ఏర్పాటు చేసిన కల్లాల డబ్బులను అడగడానికి కేంద్రానికి సిగ్గుందా? నేను ఎన్నో ప్రభుత్వాలను చూశా. ఇన్ని స్కీమ్‌లు తీసుకొచ్చి సమర్థంగా అమలు చేసిన ఒకే ఒక్క నేత సీఎం కేసీఆర్. రైతుబంధు దేశమంతా పాకిందని, రైతులంతా సీఎం కేసీఆర్ వెంట నడుస్తారని బీజేపీ భయపడుతున్నది. బంధు ఇవ్వాలని దేశమంతా దళితులు అడుగుతున్నారు. ప్రతి ఇంటికీ మంచి నీళ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. దేశంలో దేవుని పేరుతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. నల్లధనం తీసుకొచ్చి ఒక్కొక్కరికి రూ.15లక్షలు ఇస్తామని చెప్పి ఒక్క పైసా తేలేదు.
సీఎం కేసీఆర్‌ను ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బకొట్టాలని దర్యాప్తు సంస్థలను పంపుతున్నారు. ఎమ్మెల్యేల ఎర కేసులో పట్టుబడినా సిగ్గులేకుండా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం. రాష్ట్ర బీజేపీ నేతలు దేనికీ పనికిరాని వాళ్లు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కేసీఆర్‌ను ఏం చేయలేరు. ప్రజల గుండెల్లో ఉన్నారు. చేష్టలు చేస్తున్న బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పాలి.
– మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
రైతు మోదీ సర్కారు ఆటలు సాగనివ్వం
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు సరికావు. రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వమూ ముందుకు సాగదు.తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో భూగర్భ జలాలు పెరిగాయి. నాడు నీళ్లు లేక అన్ని రంగాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రైతులు ఎంతో ప్రయోజనం పొందారు. రైతుల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. రైతు వ్యతిరేక మోదీ సర్కారు ఆటలు తెలంగాణలో సాగనివ్వం.
– ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి
రాష్ట్ర ప్రజలు పన్నులు వాపస్ ఇస్తరా?
కల్లాల అడుగుతున్న కేంద్రం.. రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నులను వాపస్ ఇస్తుందా? ప్రజల పక్షాన ఒకే ఒక్క నేత కేసీఆర్ ఉన్నారు. తెలంగాణ వైపు చూస్తున్నది. బీఆర్ఎస్పై కోపంతో కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నది. రైతులంతా ఏకమై సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి, బీజేపీకి బుద్ధి చెప్పాలి.
– మాజీ ఎమ్మెల్యే బూడిద