తుంగతుర్తి, మే 01 : తుంగతుర్తి మండలంలోని గొట్టిపర్తి-పోచంపల్లి గ్రామాల మధ్య కేతిరెడ్డి వాగుపై నిలిచిపోయిన బ్రిడ్జి పనులను తక్షణమే పునః ప్రారంభించి పూర్తి చేయాలని బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు బర్ల సోమన్న ఆధ్వర్యంలో శుక్రవారం బ్రిడ్జి వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించి పనులు ప్రారంభించారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటినా పూర్తి చేయలేదని విమర్శించారు. దీనివల్ల ఇరు గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ స్పందించి బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు తునికి సాయిలు, హరిబాబు, యాకన్న, సురేష్, సమ్మద్, నాగేష్, ప్రవీణ్, భాస్కర్, రాజు, చిట్టి, బాబూ రావు, కూకట్ల యాకన్న, మద్దెల నరేష్, ఓడ వెంకన్న పాల్గొన్నారు.