తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీని అరికట్టాలి
ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి తక్షణమే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం పోలేపల్లి, గుంటిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై నిరసన వ్యక్తం చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి.
- ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీఆర్ఎస్ నిరసన
చందంపేట, మే 22 : ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి తక్షణమే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం పోలేపల్లి, గుంటిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై నిరసన వ్యక్తం చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, బీఆర్ఎస్ గిరిజన రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు జర్పుల లోక్యానాయక్ మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చి నెల దాటినా కొనుగోళ్లు చేపట్టకపోవడం దారుణ మన్నారు. పోలీసులు నచ్చజెప్పడంతో ధర్నాను విరమించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కేతావత్ శంకర్‌నాయక్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌గౌడ్, మోహన్ కృష్ణ, గోసుల శివ, మహేష్, శ్రీశైలం, గోపాల్, బాలవర్దిరాజు, సత్యనారాయణ, హరినాయక్, రామకృష్ణ, కొండల్‌రెడ్డి, రమేష్, శోభన్, కాల్యానాయక్, శివాజీ, బలరాం పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జడ్చర్ల హైవే పై ధర్నా
గుడిపల్లి, మే 22 :ఉమ్మడి పీఏపల్లి, గుడిపల్లి మండలాల్లో శుక్రవారం నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ పిలుపు మేరకు పార్టీ అధ్యక్షులు యల్గూరి వల్లపురెడ్డి అధ్యక్షతన అంగడిపేట ఎక్స్ రోడ్డు సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు జడ్చర్ల – కోదాడ హైవే పై గంట పాట రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతావత్ బీల్యానాయక్ యల్గూరి వల్లపురెడ్డి, నాయకులు మునగాల అంజిరెడ్డి, రేటినేని ముత్యంరావు, సర్పంచులు కున్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, దూదిపాల అశ్విని రాజేందర్‌రెడ్డి, రాయినబోయిన శ్రీనయ్య, నాగేష్, కిషన్ నాయక్, కీరూ నాయక్, అర్వపల్లి నరసింహా, ఎర్ర యాదగిరి, బొడ్డుపల్లి మహేందర్, కర్నాటి రవికుమార్, తోటకూరి విష్ణు, గోలి గిరి, రమావత్ శ్రీను, మద్దిమడుగు సుధీర్ నాయక్, దామోదర్ నాయక్, లోకేష్ నాయక్, పొల వెంకట్, ఓర్సు సత్యనారాయణ, భిక్షపతి, రాంబాబు, కృష్ణారెడ్డి, నిమ్మల శివశంకర్‌రెడ్డి, అంజి యాదవ్, బోడ నాగరాజు, కత్తుల రమేష్ పాల్గొన్నారు.
ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
కొండమల్లేపల్లి, మే 22 : రాష్ట్రంలో పాలన బ్రహ్మాండంగా సాగుతున్న సమయంలో అచరణకు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాటు సబ్బండ వర్గాలను నిండా ముంచిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేసాని లింగారెడ్డి, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు రమావత్ దస్రూ నాయక్ విమర్శించారు. శుక్రవారం బీఆర్ఎస్ రాష్ట్ర పిలుపు మేరకు మండలంలోని ధాన్యం కోనుగోలు కేంద్రాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి పండించిన రైతు పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. కార్యక్రమంలో చెన్నారం సర్పంచ్, మాజీ మండల యువజన అధ్యక్షుడు రమావత్ తులసీరాం నాయక్, చింతకుంట్ల సర్పంచ్ కావటి వెంకటేష్, బీఆర్ఎస్ నాయకులు రావుల వెంకటయ్య, రమావత్ శ్రీను నాయక్, ముసిని శేఖర్ యాదవ్, నేనావత్ శంకర్ నాయక్, నేనావత్ అమర్‌సింగ్, రాంబాబు, పాక అనిల్, పరమేష్, రైతులు పాల్గొన్నారు.
వర్షంతో తడిసిన ధాన్యం
డిండి, మే 22 : ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన నడుస్తున్నాయని, అకాల వర్షాలు, టార్పాలిన్ల కొరతతో ధాన్యం తడిసి రైతులకు నష్టం వాటిల్లుతోందని బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వర్రావు అన్నారు. బీఆర్ఎస్ పిలుపు మేరకు శుక్రవారం డిండిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంవద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసరావు, మల్రెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, గుర్రం సురేష్, తండు చంద్రయ్య, ఎండీ రషీద్, జయవర్దన్, మూడావత్ భాస్కర్, సీమర్ల మల్లయ్య, బాసిత్, తండు శ్రీనయ్య, అంకాలు, సపావట్ రాములు, కాసుల శ్రీను, ధన్సింగ్, బాలు పాల్గొన్నారు.
ఐకేపీ సెంటర్లో మోసం, దగా..!
సూర్యాపేట రూరల్, మే 22 : పిల్లలమర్రి ధా న్యం (2) కొనుగోలు సెంటర్లో పెద్ద మొత్తంలో అవకతవకలు, మోసం జరిగినట్లు రైతులు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పిల్లలమర్రి ఐకేపీ రెండో సెంటర్లో ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో లారీ ధాన్యంపై సుమారు రూ. 30వేల వరకు మోసగిస్తున్నారని రైతులు వాపోయారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాచకొండ ఉపేందర్, సైదులు, రాములు, సైదులు, పుల్లయ్య, సైదులు, వెంకన్న, సత్తిరెడ్డి, మధుసూధన్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

