మిర్యాలగూడ రూరల్, నవంబర్3: సీఎం కేసీఆర్‌తోనే గిరిజన తండాలు అభివృద్ధి చెందాయని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని వాటర్‌ట్యాంక్ తండా, భగ్యతండా, చిల్లాపురం, కురియా తండా, కుంటకిందితండా, ఐలాపురం, టీక్యాతం డా, జంకుతండా, వెంకటాద్రిపాలెం, శ్రీనివాస్‌నగర్, దుబ్బతం డాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న తండాల రూపురేఖలు నేడు పూర్తి మారిపోయామని తెలిపారు.
2018ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తండాలను బీఆర్ఎస్ పార్టీ ప్రగతి బాట పట్టించిందన్నారు. వాటర్‌ట్యాంకు తండాకు రూ.14.50కోట్లు, భగ్యగోప సముద్రం తండాకు రూ.3.85 కోట్లు, చిల్లాపురం రూ.19కోట్లు, కుంటకిందితండాలో రూ.3కో ట్లు, ఐలాపురంలో రూ14కోట్లు, టిక్యాతండలో రూ.8కోట్లు, వెంకటాద్రిపాలెంలో రూ.42.50 కోట్లు , శ్రీనివాసనగర్‌కు రూ.7.15కోట్లు అభివృద్ధి, సంక్షేమానికి ఖర్చుచేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అభివృద్ధి , సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేయించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు.
సర్పంచ్‌లు తీసుకొన్న చొరవ, ప్రభుత్వ కృషితో వెంకటాద్రి(వీటీ) పాలెం, శ్రీనివాసనగర్ గ్రామాలు ప్రగతిబాటలో పయనిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయా గ్రామాల గుండా కోదాడ- జడ్చర్ల రహదారిని అభివృద్ధి చేయడంతో ఆయా గ్రామాలకు మంచి డిమాండ్ వచ్చిందన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ చలువ వల్లే సాధ్యపడిందని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలోని అంశా లు ఎకరాకు రూ.16వేలు రైతు బంధు, రూ.4016 ఆసరా పింఛన్లు, మహిళలకు నెల నెల రూ.3వేలు, ఉచిత బస్సుప్రయాణం ఓటర్లకు వివరించారు.
ఈకార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ నూకల సరళహన్మంతరెడ్డి, మండల రైతు బంధు సమితీఅధ్యక్షుడు గడగోజు ఏడుకొండలు, మార్కె మాజీ చైర్మన్ ధానవత్ చిట్టిబాబు నాయక్, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మట్టపల్లి సైదులు యాదవ్, తుంపహాడ్ పీఏసీఎస్ చైర్మన్ శాగం ఆదిరెడ్డి, సర్పంచ్‌లు వెంకటరమణచౌదరి, బారెడ్డి అశోక్‌రెడ్డి, శంకర్‌నాయక్, రామచంద్రునాయక్, రవిందర్‌నాయక్ ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.