నల్లగొండ, డిసెంబర్ 01 : తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. చింతపల్లి మండలం అనాజిపురం గ్రామానికి చెందిన బీఎస్పీ మండలాధ్యక్షుడు ముదిగొండ మొగిలయ్య, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దేవరకొండ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారందరికీ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. ప్రతి కార్యకర్త క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయాలని, బీఆర్ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా సమన్వయంతో ముందుకెళ్లాలని కోరారు.
బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి గ్రామాల్లో చైతన్యం కల్పించాలన్నారు. అనంతరం అనాజీపురం గ్రామ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ముదిగొండ అనిత మొగిలయ్య ప్రకటించారు. పార్టీలో చేరిన వారిలో అనిత, నాగరాజు, కొండల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్, అశోక్, సుదీర్, శ్రీకాంత్, విష్ణువర్ధన్, రవి, నర్సింహ, కృష్ణయ్య, లక్ష్మయ్య, ధర్మారెడ్డి, సాయిరెడ్డి, మధు, జంగయ్య, మహేశ్, రమేశ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రమావత్ రమేశ్ పాల్గొన్నారు.