Aditya Dhar | భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం దర్శకుడు ఆదిత్య ధర్ పేరు మారుమోగుతోంది. ఆయన తెరకెక్కించిన ‘ధురంధర్ 2’ చిత్రం దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందనతో ముందుకు సాగుతోంది. మొదటి భాగం భారీ విజయాన్ని సాధించగా, ఇప్పుడు రెండో భాగం కూడా మంచి టాక్ సంపాదిస్తోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణను చూస్తుంటే ఈ చిత్రం మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. యాక్షన్ సన్నివేశాలు, కథనం, భావోద్వేగాలు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. ఈ విజయంతో ఇప్పుడు అందరి దృష్టి ఆదిత్య ధర్ తదుపరి చిత్రంపై పడింది. మూడో భాగం వస్తుందని అనుకున్నప్పటికీ, ఆయన తన కలల ప్రాజెక్ట్ ‘అశ్వథ్థామ’ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ చిత్రం సామాజిక-పౌరాణిక నేపథ్యంతో భారీ వ్యయంతో తెరకెక్కనుంది. కొన్ని కారణాల వల్ల ముందుగా వాయిదా పడిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించిన ఆదిత్య ధర్ తొలుత క్రికెట్‌పై ఆసక్తి చూపారు. అనంతరం రేడియో జాకీగా, నాటక రంగంలో పని చేస్తూ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.తొలి చిత్రంతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకుడిగా గుర్తింపు పొందిన ఆయన, మధ్యలో ఎదురైన ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నారు. దర్శకత్వంతో పాటు నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకుంటూ పలు చిత్రాలను రూపొందించారు. తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా మంచి కథలను ప్రేక్షకులకు అందిస్తున్నారు.
పట్టుదలతో ముందుకు సాగితే విజయాన్ని అందుకోవచ్చని నిరూపించిన ఆదిత్య ధర్, ఇప్పుడు ప్రముఖ దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. ‘ధురంధర్ 2’ విజయంతో ఆయన స్థాయి మరింత పెరిగింది. ఇక ‘అశ్వథ్థామ’ ప్రాజెక్ట్ ప్రారంభమైతే, అది మరో క్రేజీ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.ఈ సినిమాని దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. తెలుగు హీరోతో సినిమాని రూపొందించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.