Ugadi Celebrations | సింగపూర్‌లోని తెలుగు ప్రజలు ఉగాది పండుగను వైభవంగా జరుపుకున్నారు. మార్చి 19, 20వ తేదీల్లో చాంగీ రామర్ దేవాలయం, సెంగ్కాంగ్ మురుగన్ దేవాలయం, ఇషున్ మహా మారియమ్మ దేవాలయం, శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయాల్లో పరాభవ నామ సంవత్సరం సందర్భంగా ఘనంగా ఉత్సవాలను నిర్వహించారు.
ప్రత్యేకంగా టీమ్ శివ సభ్యులు మొదటిసారిగా నాలుగు దేవాల్లో ఒకేసారి ఉగాది వేడుకలను నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా భక్తులకు ఉగాది పచ్చడి, ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

ఈ ఉగాది వేడుకల ద్వారా భక్తి, ఆనందం, ఐక్యత, సాంప్రదాయాల పట్ల గౌరవం మరోసారి ప్రతిఫలించింది. సమాజంలోని సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసి పండుగను జరుపుకోవడం అందరి హృదయాలను ఆనందంతో నింపింది.

ఈ ఉత్సవాల ద్వారా సంప్రదాయం, సంస్కృతి, భక్తి, ఐక్యత మరింత బలపడగా, ప్రతి కుటుంబానికి సంతోషం, ఆరోగ్యం, శాంతి కలగాలని ఆకాంక్ష వ్యక్తమైంది. ఈ ఆశయంతో సింగపూర్‌లో టీమ్ శివ ప్రసాద్ సభ్యులు 2026 ఉగాది వేడుకలను విజయవంతంగా ముగించారు.


Singapore Ugadi1

Singapore Ugadi2
Singapore Ugadi4

Singapore Ugadi5

Singapore Ugadi6

Singapore Ugadi8