న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా వార్తా ఏజెన్సీ ఆఫీసు(UNI Office)ను శుక్రవారం రాత్రి మూసివేశారు. పారామిలిటరీ దళాలు, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఆ ఆఫీసుపై దాడి చేశాయి. సుమారు 50 మంది జర్నలిస్టులను ఆ ఆఫీసు నుంచి బయటకు గెంటివేశారు. భూ వివాదం నేపథ్యంలో కోర్టు ఆదేశాల ప్రకారం రఫీ మార్గ్‌లో ఉన్న యూఎన్ఐ ఆఫీసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం లాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్లకు రక్షణ కల్పించేందుకు యూఎన్ఐ సిబ్బందిని ఖాళీ చేయించినట్లు డిప్యూటీ కమీషనర్ సచిన్ శర్మ తెలిపారు.
అయితే తమకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదని యూఎన్ఐ తన ప్రకటనలో తెలిపింది. బలవంతంగా ఆఫీసును ఖాళీ చేయించినట్లు ఆ సంస్థ ఆరోపించింది. కొందరు ఉద్యోగులను ఈడ్చుకెళ్లారని యూఎన్ఐ పేర్కొన్నది. న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన భూకేటాయింపును రద్దు చేయడంతో శుక్రవారం రాత్రి పోలీసుల యూఎన్ఐ ఆఫీసును సీజ్ చేశారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో యూఎన్ఐ ఆఫీసును ఆధీనంలోకి తీసుకున్నారు.
ప్రభుత్వ చర్య పత్రికా స్వేచ్ఛపై దాడిగా యూఎన్ఐ పేర్కొన్నది. నాలుగు దశాబ్ధాల క్రితం కేటాయించిన భూమిపై ఏజెన్సీ ఇంత వరకు నిర్మాణం చేపట్టలేదని హైకోర్టు తన తీర్పులో పేర్కొన్నది.1979 భూ కేటాయింపు చట్టం ప్రకారం భూమి తీసుకున్న రెండేళ్లలోనే నిర్మాణాన్ని చేపట్టాలి, కానీ యూఎన్ఐ ఆ పనిచేయలేదని హైకోర్టు వెల్లడించింది.
The sealing of the office of United News of India (UNI), one of the country’s oldest and most respected news agencies, has raised serious concerns over press freedom.
📌 Staff members were forcibly evicted, with several not allowed to retrieve their personal belongings.
— United News of India (@uniindianews) March 20, 2026