Nilagiri : ‘మైనార్టీ వర్గాలకు చేరువగా ఉన్న బీఆర్ఎస్ను గెలిపించాలి’
మైనార్టీ వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆ పార్టీ నల్లగొండ 43వ డివిజన్ అభ్యర్థి అశ్వక్ హమీద్ ప్రజలను కోరారు. సోమవారం డివిజన్ పరిధిలోని దారిషాప కాలనీలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
– నల్లగొండ 43వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి అశ్వక్ హామిద్
నీలగిరి, ఫిబ్రవరి 02 : మైనార్టీ వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆ పార్టీ నల్లగొండ 43వ డివిజన్ అభ్యర్థి అశ్వక్ హమీద్ ప్రజలను కోరారు. సోమవారం డివిజన్ పరిధిలోని దారిషాప కాలనీలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాధించాక బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీ వర్గాలకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉందని తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా తోఫాలు, షాదీ ముబారక్ ల పేరుతో ఆడపిల్లలకు ఆర్థిక సాయం అందించిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు. నల్లగొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మైనార్టీలకు అండగా ఉన్న బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కాలనీవాసులు సలీం, నేతాజీ, బాబా, ఇన్చార్జి ఆసిఫ్, హజార్, ఫరీద్ ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

