చండూరు, జూన్ 19 : భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అత్యంత కీలకమైన నేపథ్యంలో శనివారం నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, బూత్ ఇన్చార్జీలు, ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తల అవగాహన కోసం శనివారం ఉదయం 10 గంటలకు మునుగోడు మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరుగుతుందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు నమోదు కావడం, తప్పులు సవరించడం, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పులు, అర్హులైన ఓటర్లను తొలగించకుండా లాంటి వాటికోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యాచరణపై సమగ్ర అవగాహన కల్పించడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం అని తెలిపారు.
ఈ అవగాహన సదస్సుకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, RS ప్రవీణ్ కుమార్, సూర్యాపేట జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ వెంకట్ నారాయణ గౌడ్, పాల్వయి స్రవంతి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. కావున మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామ శాఖ అధ్యక్షుడు, ప్రతి బూత్ ఇన్చార్జీ, ప్రతి కార్యకర్త ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరై తమ తమ గ్రామాలు, బూత్ల పరిధిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై స్పష్టమైన అవగాహన పొందాలని ఆయన పేర్కొన్నారు.