మునుగోడు, నవంబర్ 16 : రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరింత అభివృద్ధి కోసం రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను మరో మారు ఆశీర్వదించాలని బీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కోరారు. గురువారం మండల కేంద్రంలోని 1, 2, 3, 4 వార్డుల్లో గడపగడపకూ ప్రచారం నిర్వహించారు. అంతకుముందు 1వ వార్డులో ఉన్న రెణుకా ఎల్లమ్మ ఆలయంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల అధిక సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. వారంతా ఎమ్మెల్యే వెంటే ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని, తాను ఎమ్మెల్యే అయ్యాక మునుగోడు నియోజకవర్గాని ఎవరూ ఉహించని విధంగా అభివృద్ధి చేశానని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరోసారి గులాబీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు మండల కేంద్రంలో సుమారుగా రూ. 3 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ప్రజలు గెలిపిస్తే అభివృద్ధి పనులు చేయడం చేతకాక, ప్రజల అవసరాలు తీర్చడంలో విఫలమమై, తన స్వార్థం కోసం పార్టీలు మారాడన్నారు. మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ మళ్లీ ప్రజలకు మాయ మాటలు చెబుతూ వారిని మోసం చేసేందుకు యత్నిస్తున్నాడని ఎద్దేవా చేశారు. నిజమైన సేవకులు, పాలకులు ఎవరనేది ప్రజలు ఆలోచించి సరైన నాయకుడిని ఎన్నుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతి పల్లెలో సీసీ రోడ్లు వేశామని, మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిందన్నారు.
కానీ బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలల్లో వారు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదన్నారు. అలాంటి నాయకులే ఇప్పుడు తెలంగాణలో హామీలిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో గత పాలకులు 60 ఏండ్లలో చేయలేని అభివృద్ధిని సీఎం కేసీఆర్ పదేండ్లలో చేసి చూపించారని పేర్కొన్నారు. మూడోసారి కేసీఆర్ సీఎం కాగానే మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీని నెరవేరుస్తారన్నారు. ప్రజలకు మరిన్ని పథకాలు అందుతాయన్నారు. దివ్యాంగుల పింఛన్ రూ.6వేలు, ఆసరా పింఛన్ రూ.5వేలు, రైతుబంధు సాయం రూ.16వేలు, సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.3వేలు అందన్నుట్లు చెప్పారు. మహిళలకు రూ.400కే వంట గ్యాస్, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని రూ.15లక్షలు, తెలగాణ అన్నపూర్ణ పథకం ద్వారాఆ రేషన్ షాపుల నుంచి సన్నబియ్యం పంపిణీ, రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబాలకు రూ.5లక్షలు బీమా వర్తంపచేయడం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందన్నారు.
నియోజక వర్గంలో తాను చేసిన అభివృద్ధి ప్రతి ఇంటి ముందు కనిపిస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను అధిక మెజార్టీతో గెలిపిస్తే రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం చౌరస్తాలో ఉన్న దుకాణాల యజమానులను కలిసి ఓటు అభ్యర్థించారు. ఓ టీకొట్టులో ఎమ్మెల్యే కూసుకుంట్ల స్వయంగా చాయ్ తయారు చేసి ప్రజా ప్రతినిధులకు ఇచ్చారు. ఆయన వెంట ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుశోత్తంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, పాలకూరి నరిసింహగౌడ్, పందుల శ్రీను, ఈద శరత్‌బాబు, గుర్రం అంజయ్య, యాసరాణీ దినేశ్, రావిరాల కుమారస్వామి, పందుల నరిసింహ, వట్టికోటి నరిసింహ, పెరమాళ్ల ప్రయణ్‌కుమార్, దుబ్బరవి, దుబ్బరాజు, ఈరిగి విజయ్, మిర్యాల మధకర్, వాజిద్, పాలకూరి రాము, నకిరేకంటి వెంకన్న, పందుల పాపయ్య, లింగస్వామి, రాజేశ్ పాల్గొన్నారు.