సూర్యాపేట, జూలై 7 (నమస్తే తెలంగాణ) : వర్షాలు లేక భూములు బీడుగా మారే ప్రమాదం పొంచి ఉం ది.. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంపుహౌస్ మోటార్లను ఆన్ చేసి జిల్లాకు గోదావరి జలాలు ఇవ్వాలి.. లేకుంటే మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో జిల్లాలోని రైతులందరం కలిసి వచ్చి తామే మోటార్లు ఆన్ చేసుకుంటామని.. తమను అడ్డుకునే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదంటూ పలువురు రైతులు తీవ్ర స్వరంతో ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మంగళవారం మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ ముఖ్య నాయకుల నేతృత్వంలో వందలాదిగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, రైతులు కలెక్టరేట్‌ను ముట్టడించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, రైతులు మాట్లాడారు. ఏ ప్రభుత్వానికి కూడా రైతుల ఉసురు తాకొద్దని.. అది మంచిది కాదన్నారు. ప్రాజెక్టు ఎవరు నిర్మించారనే విషయం పక్కన పెట్టి, భేషజాలకు పోకుండా కన్నెపల్లి పంపు హౌజ్ మోటార్లను తక్షణమే ఆన్‌చేసి ఎండుతున్న ఆయకట్టుకు గోదావరి జలాలు అందజేయాలని డిమాండ్ చేశారు.

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు ప్రమా దం పొంచి ఉందని, వర్షాలు లేక పంటలు పండే పరిస్థితి లేదని, వేసిన పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి ఏటా సకాలంలో నీరందించి రైతాంగాన్ని ఆదుకుందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కేవలం రాకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కాళేశ్వరం జలాలను సరఫరా చేయకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు. తక్షణమే కన్నెపల్లి పంపు హౌజ్ మోటార్లను ఆన్‌చేసి ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని, సాగునీటి విషయంలో రాజకీయాలు పక్క న బెట్టి రైతుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. రైతుల కలెక్టరే ట్ ముట్టడితో సుమారు రెండు గంటల పాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా బీఆర్ఎస్ నాయకుల చొరవతో సద్దుమణిగింది.
అనంతరం బీఆర్ఎస్ నాయకులు జిల్లా కలెక్టర్ట్లో వినతిపత్రం సమర్పించారు. ప్రభు త్వం స్పందించి తక్షణమే గోదావరి జలాలను విడుదల చేయాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ జాతిపిత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, పెరుమాళ్ల అన్నపూర్ణ, ఉప్పల ఆనంద్, జీడి భిక్షం, పుట్ట కిశోర్, తూడి నర్సింహారావు, కొణతం సత్యనారాయణరెడ్డి, బాబూ నాయక్, ఈదుల యాదగిరి, ఆకుల లవకుశ, ముద్దం కృష్ణారెడ్డి, ముదిరెడ్డి సంతోష్‌రెడ్డి, ఉప్పుల సైదులు యాదవ్‌తో రైతులు పాల్గొన్నారు.
మోటార్లు ఆన్‌చేసి రైతులను ఆదుకోవాలి

మోతె, జూలై 7 : కన్నెపల్లి పంపు హౌస్ మోటార్లను వెంటనే ఆన్‌చేసి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతె మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ఎస్ఆర్ఎస్పీ కాల్వ వద్ద సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలు తెలంగాణ వ్యవసాయ రంగానికి జీవనాడిగా నిలిచాయని, వాటిని ప్రభుత్వం సక్రమంగా నిర్వహించాలన్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మరమ్మతులు చేస్తే ప్రమాదం జరుగుతుందంటూ సాకులు చూపుతూ కాలయాపన చేస్తోందన్నారు. 1983లో ఎస్ఆర్ఎసీపీ ఫేజ్ టును నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన అనంతరం ప్రభుత్వాలు కాల్వలు తవ్వి గాలికి వదిలేశాయన్నారు. కానీ నీటిని మాత్రం వదలలేదన్నారు. 2018లో కేసీఆర్ హయాంలో ఎస్ఆర్ఎస్పీ కాల్వ ద్వారా సాగునీరు పారించడం సాధ్యమైనదని, వేసవిలో సైతం చెరువులు అలుగు పోసిన ఘనత కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుందని కొనియాడారు.
తమ త్యాగం వల్లే దిగుబడి పెరిగిందని జబ్బులు జరుచుకునే నాయకులు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలన్నారు. కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పీ నుంచి కోదాడ వరకు సాగునీరు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. వృధాగా నీళ్లు పోతున్నా రైతులకు సాగునీరందించే తెలివిలేని నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. పంట పొలాలను బీడు భూములుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదని, రైతుల కష్టాలు తెలుసుకొని ప్రభు త్వం వెంటనే కన్నెప ల్లి పంప్ హౌస్‌ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శీలం సైదులు యాదవ్, మాజీ ఎంపీపీ నారె లింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి మద్ది సూదన్‌రెడ్డి, మిక్కిలేని సతీష్, బాణోతు దేవ్లా, మాజీ సర్పంచులు గుండాల గంగులు, భూక్యా గాంధీ నాయక్, బాణోతు వెంకన్న, గాంధీ నాయక్, బాబూ నాయక్, సైదులు, మూడ్ కృష్ణా నాయక్, లింగయ్య, బత్తిని కనకయ్య, బాలాజీ పాల్గొన్నారు.