చండూరు, జూన్ 04 : చండూరు మండల పరిధిలోని చొప్పరవారిగూడెంలో బుధవారం విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన చొప్పరి చందు కుటుంబాన్ని బీఆర్ఎస్ చండూరు మండల నాయకులు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా చేతికి అందివొచ్చిన కొడుకు అకస్మాత్తుగా మరణించడం పట్ల శోకసముద్రంలో మునిగిపోయిన చందు తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు బిఆర్ఎస్ జిల్లా నాయకులు ఎత్తపు మధుసూదన్ రావు, మండల అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, యువజన విభాగం మండల అధ్యక్షులు, ఉజ్జిని అనిల్ రావు రూ. 30 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చొప్పరి శంకర్, గ్రామ సర్పంచ్ జాల వెంకన్న, లింగస్వామి, సత్తయ్య, రమేశ్, వెంకన్న, అరుణాచలం పాల్గొన్నారు.