చౌటుప్పల్, మార్చి 20: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్న కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీ వేడుకల విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సూర్యాటకు వెళ్తున్న కేటీఆర్‌కు.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ వద్ద మునుగోడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందించి శాలువలతో సత్కరించారు.
అంతేకాకుండా యువత రామన్న అనే నినాదాలతో సందడి చేశారు. కేటీఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేసి సెల్ఫీలు దిగారు. అనంతరం అక్కడి నుంచి సూర్యాపేటకు బయలుదేరారు. ఘన స్వాగతం పలికిన వారిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్వాయి స్రవంతి, చింతల దామోదర్ రెడ్డి, గిర్కటి నిరంజన్ గౌడ్, పెద్దింటి బుచ్చిరెడ్డి, బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, సుర్వి మల్లేశం గౌడ్, ఊడుగు మల్లేశం గౌడ్, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, ముప్పిడి శ్రీనివాస్ గౌడ్, చిన్నం బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.