మునుగోడు, ఆగస్టు 19 : మునుగోడుపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిది సవతి తల్లి ప్రేమ అని బీఆర్ఎస్ మునుగోడు మండలాధ్యక్షుడు మందుల సత్యం అన్నారు. మంగళవారం పార్టీ నాయకులు పగిల్ల సత్యం, మారోగోని అంజయ్య, పోలగోని సైదులు, జాల నాగరాజుతో కలిసి మండల కేంద్రంలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి మీద ప్రమే ఉన్నది కానీ, మునుగోడు అబివృద్ధిపై లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు నిధులు లేవన్నారు, అధికారంలో ఉన్నపుడు దగ్గరికి రానివ్వడం లేదంటున్నారన్నారు.
మునుగోడు నియోజకవర్గం అబివృద్ధి చెందిందంటే అది మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితోనే అన్నారు. రూ.570 కోట్లు తెచ్చి మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ముందుకు సాగినట్లు తెలిపారు. ఘట్టుప్పల ను మండలంగా, చండూరును రెవెన్యూ డివిజన్‌గా మార్చిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. మునుగోడును మున్సిపాలిటీ చేస్తామన్న మాట ఎక్కడికి పాయే అన్నారు. అభివృద్ధి చేసిన నాయకుడిని విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులది కాదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు మేకల శ్రీనివాస్ రెడ్డి, ఎడవెల్లి సురేశ్‌కుమార్, ఈద శరత్ బాబు, మదనబోయిన పరమేశ్, దోటి కరుణాకర్, ఎల్లంకి యాదగిరి, మల్లేశం, దుబ్బ రాజశేఖర్, వట్టికోటి నరసింహ, సాదు రాము, బండారు శ్రీనివాస్, మల్లేశ్ పాల్గొన్నారు.