సూర్యాపేట, జనవరి 20 : బీఆర్ఎస్పై అలాగే కేటీఆర్, హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఇతర నాయకులు మంగళవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కనుమరుగైన టీడీపీ, చంద్రబాబుపై ప్రేమ వలకబోయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలు కూలగొట్టమని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం రేవంత్ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలిచిందనే అక్కసు ఒకవైపు, రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఆరాటం ఇంకోవైపుతో ఇటువంటి చర్యలకు పాల్పడడం హేయనీయమన్నారు. రేవంత్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా కేసీఆర్, కేటీఆర్, జగదీష్ రెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సూర్యాపేట పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూర బాలసైదులు గౌడ్, ఆకుల లవకుశ, తాహెర్ పాషా, బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, అమరవాది శ్రవణ్, బుడిగా నవీన్ పాల్గొన్నారు.