రైతు భరోసాలో కాంగ్రెస్ సర్కారు కోత పెట్టడంపై బీఆర్ఎస్ పార్టీ భగ్గుమంటున్నది. రైతుల పొట్ట కొట్టే నిర్ణయాన్ని ఖండిస్తూ రోడ్డెక్కింది. రేవంత్ రెడ్డి సర్కారు తీరును వ్యతిరేకిస్తూ రైతులతో కలిసి ఆందోళనలు చేస్తున్నది. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు ఎకరాకు రూ.15వేలు ఇవ్వాల్సిందేనని పట్టు పడుతున్నది. ఈ మేరకు నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం రాస్తారోకోలు కొనసాగాయి. తుంగతుర్తి మండలం రామన్నగూడెంలో కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఆత్మకూర్.ఎస్‌లో తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. యాదగిరిగుట్టలో ర్యాలీ తీసి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.
తుంగతుర్తి, జనవరి 7 : ఎన్నికల హామీ మేరకు కాకుండా రైతు భరోసాలో కోత పెట్టడాన్ని నిరసిస్తూ తుంగతుర్తి మండలంలోని రామన్నగూడెంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు, గ్రామస్తులు కండ్లకు గంతలు కట్టుకుని నిరసనకు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచన చేస్తుందని మండిపడ్డారు. రైతులందరికీ రుణమాఫీ చేయాలని రేవంత్‌రెడ్డి సర్కారు రైతు భరోసా విషయంలోనూ మోసం చేస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గుండగాని రాములుగౌడ్, గాజుల యాదగిరి, మాజీ ఎంపీటీసీ ఆంగోతు నరేశ్, రైతులు పాల్గొన్నారు.
ఆత్మకూర్.ఎస్, జనవరి 7 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పినట్టు రైతులకు ఎకరాకు రూ.15వేలు పంట పెట్టుబడి సాయం ఇవ్వాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూడి నర్సింహారావు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదేశాల మేరకు పూర్తి రైతుభరోసా కోసం స్థానిక తాసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా చేశారు. అనంతరం తాసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నర్సింహారావు మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్లే కాంగెస్ సర్కారు రైతులందరికీ రైతు భరోసా ఇవాలన్నారు. రైతులను మోసం చేస్తే సహించేది లేదని, అన్నదాతల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మర్ల చంద్రారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ముద్దం కృష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రసాద్, మాజీ ఎంపీటీసీలు మిర్యాల వెంకటరెడ్డి, కన్న య్య, శ్రీనివాస్‌రెడ్డి, గంపల సుంద ర్, బీరెల్లి రాంరెడ్డి, కొండేటి రవీందర్‌రెడ్డి, గునగంటి భిక్షం, మాజీ సర్పంచ్‌లు మడ్డి వెంకన్న, సానబోయిన సుధాకర్, గ్రామశాఖ అధ్యక్షుడు బషీర్, నాయకులు సైదులు, తంగెళ్ల శ్రీనివాస్‌రెడ్డి, గుండాల నాగరాజు, రైతులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట, జనవరి7 : రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు ఆందోళనలు తప్పవని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య అన్నా రు. రైతు భరోసా రూ.15వేలను భేషరతుగా అమ లు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయం నుంచి వైకుంఠ ద్వారం వరకు, అక్కడి నుంచి పాతబస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రో డ్డుపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రుణమాఫీలో కోతలు పెట్టి చేతులు దులిపేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పు డు రైతు భరోసాకు కొర్రీలు, కోతలు పెట్ట డం దుర్మార్గమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చే స్థితిలో రేవంత్‌రెడ్డి సర్కారు లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వెళ్లే మొహం లేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ తోటకూరి అనురాధ, మున్సిపల్ వైస్ చైర్మన్ కాటంరాజు, కౌన్సిలర్ బూడిద సురేందర్, బీఆర్ఎస్ పట్టణ సెకట్రరీ జనరల్ పాపట్ల నరహరి, బీసీ విభాగం మండలాధ్యక్షుడు కవిడే మహేందర్, జిల్లా నాయకులు మిట్ట వెంకటయ్య, ఆరె శ్రీధర్, పేరబోయిన పెంటయ్య, కందాల రంగారెడ్డి, గాజుల శ్రీనివాస్, పేరబోయిన సత్యనారాయణ, కోన్యాల నర్సింహారెడ్డి, అంకం నర్సింహా, సతీశ్‌యాదవ్, మహేశ్, బాబురావు, భాస్కర్, రమేశ్, చంద్రం పాల్గొన్నారు.
బొమ్మలరామారం, జనవరి 15 : రైతు భరోసాలో కోతలను ఖండిస్తూ బొమ్మలరామారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండలాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్‌గౌడ్ మాట్లాడుతూ మోసపూరిత ప్రకటనలు చేస్తున్న రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పాలన్నారు. ఏటా ఎకరాకు రైతు భరోసా రూ.15వేలు ఇవ్వకపోతే రైతుల నుంచి తీవ్ర పోరాటాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సింహ, మాజీ ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల నాయకులు మన్నె శ్రీధర్, బెజ్జంకి పాపిరెడ్డి, నాగరాజు, మహేందర్‌రెడ్డి, జంగయ్య, రాజు, శాంతాచారి పాల్గొన్నారు.