భువనగిరి కలెక్టరేట్/యాదగిరిగుట్ట, ఆగస్టు 27 : భారత జాగృతి సంస్థ జాతీయ అధ్యక్షురాలు, ఎ మ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై బీఆర్ఎస్, జాగృతి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రిన్స్ చౌరస్తాలో జాగృతి సంస్థ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సుజిత్‌రావు ఆధ్వర్యంలో మంగళవారం సా యంత్రం పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూనే.. మన సంస్కృతికి, సంప్రదాయాల పరిరక్షణకు బతుకమ్మతో కవిత చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం కక్షగట్టి ఆమెను జైలు పాలు చేయడం దుర్మార్గమన్నారు. సుప్రీం కోర్టు తీర్పు అందుకు చెంపపెట్టు అని పేరొన్నారు. కార్యక్రమంలో జాగృ తి జిల్లా నాయకులు మచ్చ చక్రవర్తి, తుంగతుర్తి సంతోశ్, నరేశ్‌యాదవ్, ప్రభాకర్, భాను రిజ్వా న్, వినయ్, శివ, మహేందర్, బీఆర్ఎస్ నాయకులు చిరంజీవి, సురేశ్‌యాదవ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ సంతోషకరం
రాజకీయ దురుద్దేశంతో ఢిల్లీ లిక్కర్ కేసులో అన్యాయంగా ఇరికించి, అరెస్టు చేసిన ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం ఎంతో సంతోషకరం. ఈ కేసులో బలం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ను ఎదుర్కొనలేకనే బీజేపీ దొంగదెబ్బ తీయాలని తప్పుడు కేసులు నమోదు చేయించింది. ఆధారాలు లేకున్నా అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారు.
– గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్
ధర్మమే గెలిచింది
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడం పట్ల హర్షణీయం. మహిళా ప్రజాప్రతినిధిపై బీజేపీ ప్రభుత్వం దాడికి దిగింది. బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేక అరెస్టులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. కుట్రపూరితంగా వ్యవహరించి కవిత ఇన్ని రోజులు జైలులో ఉంచడం దారుణం. ఈ కేసులో ఏమీ లేదు, ఇలాంటి కేసును ఎందుకు ఇన్ని రోజులు పెండింగ్ పెట్టారని సుప్రీం కోర్టు న్యాయమూర్తులే ఈడీని ప్రశ్నించారు. దాంతో కవిత నిర్దోషి అని తేలిపోయినట్టు అయ్యింది. ధర్మమే గెలిచింది.
– బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే