రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుమలగిరిలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. ఏడాదిన్నర కాలంలో చేసిందేమీ లేక, ఇది చేశామని చెప్పుకోలేక సీఎం స్థాయిని దిగజార్చేలా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. ముఖ్యంగా కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను కేసీఆర్ ఈ ప్రాంతానికి అందిస్తే అసలు ఆ నీళ్లే రాలేదంటూ రేవంత్ మాట్లాడడం తగదని హితవు పలికారు. సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగం తీరు కళ్లుండీ చూడలేని కబోదిని తలపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల బీఆర్ఎస్ నేతలు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ భవన్లో ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. రైతుల సమక్షంలోనే గోదావరి జిలాలపై తేల్చుకుందామని, ఎవరిది తప్పని తేలితే వాళ్లు అదే రైతుల చేతుల్లో చెంప దెబ్బలకు సిద్ధం కావాలంటూ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో బుధవారం సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కాళేశ్వరం జలాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు ఏర్పాట్లు చేశారు. మరోవైపు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ కూడా రేవంత్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ప్రజల నుంచి స్పందన లేకనే రేవంత్‌రెడ్డి బూతులతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధికోసమే రేవంత్ స్టంట్ మాస్టర్ అవతారం ఎత్తాడంటూ ఎద్దేవా చేశారు.
నల్లగొండ ప్రతినిధి, జూలై15(నల్లగొండ): కేవలం స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసమే తుంగతుర్తిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారన్నది బహిరంగ రహస్యం. ఈ సభ లో గత బీఆర్ఎస్ సర్కార్ ఒ క్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, తామే కొత్తగా కా ర్డులు ఇస్తున్నామని గొ ప్పలకు పోయారు. అ యితే కేసీఆర్ హయాం లో రాష్ట్రంలో 6.75 లక్షల కొత్త రేషన్ కా ర్డులు ఇచ్చిన విషయా న్ని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు గుర్తు చేశా రు. ఈ విషయం గతంలో బీఆర్ఎస్లో ఉండి ప్రస్తు తం కాంగ్రెస్ సర్కార్‌లో మం త్రులుగా ఉన్న పొంగులేటి వం టి వాళ్లకు తెలుసంటూ ఆధారాలతో సహా ఎదురుదాడికి దిగారు.
ఇక ఇదే సమయంలో తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాలకు గోదావరి జిలాలు ఇవ్వలేదనే మరో అబద్ధపు మాటలు మంత్రి ఉత్తమ్‌తో పాటు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. తాము దేవాదుల ప్రాజెక్టులోని 6వ ప్యాకేజీని పూర్తి చేసి తుంగతుర్తి, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్ తదితర నియోజకవర్గాలకు గోదావరి జిలాలను పారిస్తామని ప్రకటించారు. అయితే 2014కు పూర్వం ఎప్పుడో కాంగ్రెస్ సర్కార్ హయాంలో మొదలైన దేవాదులతో ఇప్పటివరకు నీళ్లు ఎందుకు పారించలేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
కానీ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 2018 వానాకాలం నుంచి 2023 వానాకాలం వరకు బీఆర్ఎస్ హయాంలో వరుసగా ఐదేండ్ల పాటు పది పంటలకు నీళ్లిచ్చిన ఆధారాలు కండ్ల ముందున్నాయని చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఏ రైతును అడిగినా కాళేశ్వరం ద్వారా గోదావరి జిలాలు వచ్చాయో లేదో చెప్తారని, రైతులవద్దకు వచ్చే ధైర్యం ఉందా అని సవాల్ చేస్తున్నారు. గోదావరి జలాలపై రైతుల్లోనే తేల్చుకుందామని తాజాగా జగదీశ్‌రెడ్డి కూడా సీఎం, మంత్రులకు సవాల్ విసరడం గమనార్హం. సమైక్య రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీల గురించి ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్ నేతలు నేడు కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం తగదని హితవు పలికారు.
జగదీశ్‌రెడ్డి, కిషోర్‌కుమార్ కృషితోనే నాగారం, అడ్డగూడూరు, మద్దిరాల వంటి కొత్త మండలాలు ఏర్పాటయ్యాయని ఇక్కడ ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఈ మండలాల్లో కోట్లాది రూపాయల అభివృద్ధి పను లు జరిగాయని ఆధారాలతో సహా చూపుతున్నారు. అయితే ప్రభుత్వ కార్యాలయాలు కట్టలేదంటూ చేసిన వ్యా ఖ్యలకు సైతం గాదరి కిషోర్ దీ టుగా సమాధానమిచ్చారు. కాంగ్రెస్ హయాంలో మాది రి కాకుండా కేసీఆర్ హ యాంలో ప్రణాళికాబద్ధమై న అభివృద్ధితో ముందుకు సాగామని చెప్పారు. ముం దుగా జిల్లా స్థాయిల్లో కొత్త కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలను దేశానికే ఆదర్శంగా నిర్మించామని స్ప ష్టం చేశారు. తర్వాత దశలో మండల కార్యాలయాల నిర్మించే ప్లాన్ జరిగిందన్నారు. రేవంత్‌రెడ్డి మాదిరిగా క్లబ్ నుంచి తమ జీవితాలు మొదలు కాలేదని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కాళేశ్వరం పక్కన పెట్టి..
కాళేశ్వరం ప్రాజెక్టును తమకు అప్పగిస్తే మూడు రోజుల్లో గోదావరి జలాలను పారించి చూపుతామని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో మాత్రం దీన్ని పక్కన పెట్టి పదేండ్లల్లో దేవాదుల నీళ్లు ఎందుకు ఇవ్వలేదంటూ పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం చర్చనీయాంశమైంది. ఎస్ఆర్ఎస్పీ రెండో దశలో చివరి ప్రాంతాలైన తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లోని సాగు భూములకు 2018 నుంచి 2023 వరకు కేసీఆర్ హయాంలో ప్రతీ ఎకరాకు సాగునీరు పారింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గత రెండు యాసంగిల్లోనూ గోదావరి జలాలు రాక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి.
ఈ నేపథ్యంలో మేడిగడ్డ కుంగుబాటును అడ్డంపెట్టకొని ఈ ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ కావాలనే కక్ష పూరితంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఇదే విషయాన్ని జగదీశ్‌రెడ్డి ప్రస్తావిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టును ఇప్పటికైనా తమకు అప్పగిస్తే మూడు రోజుల్లోనే నీళ్లు పారించి చూపుతామని సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి దీన్ని పక్కదోవ పట్టించేలా దేవాదుల ఎందుకు పూర్తి చేయాలేదంటూ ఎదురుదాడికి దిగారు.కాళేశ్వరం నుంచే ఇక్కడికి గోదావరి జలాలు వచ్చాయనే వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు రేవంత్ పాట్లు పడుతూ ఎప్పటిలాగే తన బూతు మాటలతో మభ్యపెట్టాలని చూశారు. సభకు వచ్చిన వారు ఈ ప్రాంతంలోని భూములు కాళేశ్వరం పూర్తయ్యాకే గోదావరి జలాలతో పుష్కలంగా పంటలు పండాయంటూ పేర్కొన్నారు.రేవంత్‌రెడ్డి కాళేశ్వరాన్ని పక్కన పెట్టి ఎప్పుడు పూర్తవుతుందో తెలియని దేవాదుల 6వ ప్యాకేజీ ద్వారా నీళ్లిచ్చి సస్యశ్యామలం చేస్తామనడంతో నియోజకవర్గ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ నీచమైన భాష తెలంగాణకే సిగ్గుచేటు
సూర్యాపేటటౌన్, జూలై 15 : ఊసరవెల్లిలా పూటకో పార్టీ మార్చే రేవంత్‌రెడ్డి నువ్వా జగదీశ్‌రెడ్డి గురించి మాట్లాడేది.. సీఎంగా స్థాయి మరిచి మాట్లాడిన నీ నీచమైన భాషకు యావత్ తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని సూర్యాపేట మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. తిరుమలగిరి సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లిన దొంగవి నువ్వా మా నాయకులను విమర్శించేదన్నారు. జగదీశ్‌రెడ్డి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావ్ అంటూ ప్రశ్నించారు. 14ఏండ్ల్లు తెలంగాణ ఉద్యమం నడిపి, అనంతరం పదేళ్ల పాలనలో జగదీశ్‌రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు. మేం సాధించిన తెలంగాణలో ముఖ్యమంత్రివైన నువ్వు 20 నెలల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ప్రజా సమస్యలను ఏకరవు పెడుతున్న జగదీశ్‌రెడ్డిపై అక్కసు వెళ్లగక్కడానికే తిరుమలగిరికి వచ్చవా అని ప్రశ్నించారు. జగదీశ్‌రెడ్డికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ప్రజా వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి దొంగ రేవంత్
మిర్యాలగూడ, జూలై 15: ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ నాయకులను విమర్శించే స్థాయి లేదని ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి అని, ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తోందని, అలాంటి నీకు బీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు చేసే స్థాయి లేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం తిరుమలగిరిలో జరిగిన సభలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఉద్దేశించి మూడడుగుల మనిషి అని వ్యక్తిగత దూషణలకు దిగారని, నువ్వు ఎన్ని అడుగుల ఎత్తున్నవో.. మీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని అడుగు చెప్తాడన్నారు.
‘మూడు ఫీట్ల నాయకుడి కింద నేను పనిచేయాలా’.. అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగదీశ్‌రెడ్డికి సీఎం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్ర స్థానంలో ఉందంటే అది కేవలం కేసీఆర్ ఘనతేనని అన్నారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి విద్వేషపూరితమైన ప్రసంగాలు మానుకొని, పాలనపై దృష్టి సారించాలని లేనట్లయితే ప్రజలే సరైన సమయంలో గుణపాఠం చెప్తారన్నారు. సమావేశంలో డీసీసీబీ మాజీ వైస్ ఛైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి పాల్గొన్నారు.
రేవంత్ వ్యాఖ్యలు ఆయన కుసంస్కారానికి నిదర్శనం
ఆత్మకూర్.ఎస్, జూలై 15 : ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఆయన కుసంస్కారానికి నిదర్శనమని ఆత్మకూర్.ఎస్ మండల బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలగిరిలో సీఎం చేసిన వ్యాఖ్యలపై మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు నేతలు మాట్లాడారు. ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో వరుసగా 8 పంటలకు సాగునీరందించిన ఘనత జగదీశ్రెడ్డిదేనన్నారు. సీఎం చేసిన వ్యాఖ్యలతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఖాళీ అవడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు భూముల్లో సైతం జాలుపారి జమ్మి పుట్టిన విషయం వాస్తవం కాదా అన్నారు. ఎస్సారెస్పీ ఆయకట్టు నీటి విడుదలపై హామీ ఇవ్వలేని, చేతకాని తనం కాంగ్రెస్ ప్రభుత్వానిదేన్నారు.
జగదీశ్‌రెడ్డి హయాంలో ఉమ్మడి జిల్లాలో మూడు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడమే కాకుండా, ఉమ్మడి నల్లగొండ జిల్లా దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా ఎదిగిందన్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన ఖ్యాతి జగదీశ్రెడ్డిదేనన్నారు. ఎస్సారెస్పీ నీటి విడుదలపై ఎలాంటి ప్రకటన చేయకుండా ప్రజలను పక్కదోవ పట్టించేందుకే సీఎం అలాంటి వ్యాఖ్యలు చేశారని ప్రజలు గ్రహించారన్నారు. తాను సీఎం అన్న సంగతి మరిచిపోయి ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయన్నారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు తూడి నర్సింహారావు, జిల్లా నాయకులు మర్ల చంద్రారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ ముద్దం కృష్ణారెడ్డి, కసగాని బ్రహ్మంగౌడ్, బెల్లంకొండ యాదగిరిగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రసాద్, మాజీ ఎంపీటీసీ మిర్యాల వెంకటరెడ్డి, రంగారెడ్డి, గునగంటి భిక్షం, తిరుమలేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రేవంత్..అడ్డగోలు మాటలు మానుకో..
పెన్‌పహాడ్, జూలై 15 : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం తిరుమలగిరి సభలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిపై చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను బీఆర్ఎస్ మండల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని అనంతారం అడ్డరోడ్డు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు దొంగరి యుగంధర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు ప్రజాక్షేత్రంలో తిరగలేరన్నారు. రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిననే విషయం విస్మరించి మాట్లాడుతున్నారని, తెలంగాణను ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసని అన్నారు.
కేసీఆర్ హయాంలో ఎస్సారెస్పీ ఆయకట్టు భూముల్లో కూడా నీరు జాలుగా పొంగిపొర్లిందన్నారు. గడ్డి కూడా పుట్టని చోట జమ్ము పుట్టించిన వ్యక్తి జగదీశ్‌రెడ్డి అని అన్నారు. ఉమ్మడి జిల్లాను రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేశారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు దంతాల వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ నెమ్మాది నగేష్, మండల నాయకులు పొదిల నాగార్జున, దాచేపల్లి సుధాకర్, నారాయణరెడ్డి, ధర్మయ్య, దాసరి శ్రీనివాస్, మేకల విజయ్ తదితరులు పాల్గొన్నారు.