నల్గొండ రూరల్, ఫిబ్రవరి 09 : నల్లగొండ పట్టణంలోని 41వ డివిజన్లో టీఎన్జీవో మాజీ నాయకుడు మామిడాల రమేశ్‌పై జరిగిన దాడికి బీఆర్ఎస్కు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ 41వ డివిజన్ అభ్యర్థి కంచనపల్లి వెంకటలక్ష్మి నరసింహారావు (కన్నారావు) స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వారి కులాల వ్యక్తిగత పంచాయితీ, దాడులకు తమకు సంబంధం లేదని చెప్పారు. దాడి చేసిన వారికి బీఆర్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేకనే అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. డివిజన్లోని ప్రధాన కాలనీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, పారిశుధ్యం కూడా లోపించిందన్నారు. కారు గుర్తుపై ఓటేసి తనను గెలిపిస్తే డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టడంతో పాటు, పార్కులను అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.