కట్టంగూర్, అక్టోబర్ 17 : బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించే బంద్ ఫర్ జస్టిస్‌కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ద అమలుకు ఎలాంటి ప్రయత్నం చేయకుండా బీసీలను మోసగించేందుకు జీఓల పేరిట కాంగ్రెస్ కాలయాపన చేస్తుందన్నారు. వెనుకబడిన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం జరుగుతున్న బంద్‌కు విశాల ప్రజా మద్దతు వెల్లువలా వస్తుందని తెలిపారు. కోర్టుల అభ్యంతరాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదంతా డ్రామాలేనన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగబద్దంగా అమలు చేయాల్సిందేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు బీసీ జేసీఏతో కలిసి బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.