తుంగతుర్తి, ఏప్రిల్ 27 : తుంగతుర్తి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సీతయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా 2001లో జలదృశ్యంలో బీఆర్ఎస్ పురుడుపోసుకున్నదని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అలుపెరుగని పోరాటంతో స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి సరికొత్త చరిత్ర లిఖించిందన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు మల్యాల రాములు, గోపగాని రమేష్, తడకమళ్ల రవికుమార్, గోపగాని శ్రీనివాస్, గూగులోతు రవి నాయక్, గోపగాని వెంకన్న, వెంకట్ నర్సు, లాథీబ్, వెంకటేష్, మల్లేష్, సాయికిరణ్, వెంకటేష్, బాలు నాయక్ పాల్గొన్నారు.