తిరుమలగిరి(సాగర్), నవంబర్ 21: జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఊరుఊరంతా ఒక్కటై ఘన స్వాగతం పలుకుతున్నారు. మహిళలు మంగళ హారతులు పట్టి ఆశీర్వదిస్తున్నారు. చిన్నాపెద్ద గులాబీ జెండాలు చేతబట్టి కలిసి నడుస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రచార ర్యాలీలు విజయోత్సవ జులూస్ను తలపిస్తున్నాయి.
గిరిజన జాతికి మరో సేవాలాల్ సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే భగత్‌కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని మేగ్యాతండా, భో జ్యాతండా, ధన్‌సింగ్‌తండా, శీతలతండా, నేతాపురం, గట్టుమీదితండా, శాంతినగర్, జువ్విచెట్టుతండా, డొక్కలబావితండా, కిచ్చాతండా, గరకనట్తండాల్లో ఎన్ని కల ప్రచారం నిర్వహించారు. ఆయా తండాల్లో గిరిజనులు డప్పు వాయిద్యాలతో జై కేసీఆర్, జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేస్తూ పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. 36 ఏండ్లు నియోజకవర్గాన్ని పాలించిన జానారెడ్డి అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉండే వ్యక్తి గిరిజనుల కష్టాలు, రైతుల బాధలను ఏనాడూ పట్టించుక్ను దాఖలాలు లేవని అన్నారు. 500 జనాభా కలిగిన తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. రైతులకు 24గంటల కరెంట్ అందిస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు. మండలంలో వందల మందికి పోడు భూముల పట్టాలిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. ప్రతిపక్షాలు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు వారిని నిలదీయాలని సూచించారు. ఆరు గ్యారెంటీలు అని మాయమాటలు చెబుతున్నారని, నమ్మవద్దని హెచ్చరించారు.
ఓర్వలేకనే బురద జల్లే ప్రయత్నం
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ఎద్దేవా చేశారు. జానారెడ్డి 36 ఏండ్ల పాలనలో నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. అధికారంలో ఉండి కూడా ప్రజల సమస్యలను పరిష్కరించలేదని తెలిపారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి నోముల భగత్‌ను అధిక భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు
గిరిజనులకు అన్నిరంగాల్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తూ పది శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్ అన్నారు. గిరిజనులంతా సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉండాలని అన్నారు. గిరిజనులు కారు గుర్తుకు ఓటేసి నోముల భగత్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీపీ భగవాన్‌నాయక్, జడ్పీటీసీ సూర్యాభాష్యనాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్‌రెడ్డి, ఏఐబీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాబురావునాయక్, ఏఐబీఎస్ఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు బిక్షానాయక్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పిడిగం నాగయ్య, సర్పం చ్‌లు సాజి భిచ్చానాయక్, ధనావత్ చంప్లి, చందులాల్, బాసిరెడ్డి కుమారివెంకట్రెడ్డి, జ్యోతిశంకర్, కోటమ్మ, కైకబిచ్చానాయక్, జటావత్ దేవుడునాయక్, ఎంపీటీసీలు భార్గవిశ్రీనివాస్రెడ్డి, రమావత్ స్వాతిభగ్గు, పెద్దిరాజు, రమణరాజు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి
త్రిపురారం, నవంబర్ 21: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలోనే సమగ్రాభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రానికి చెందిన కాం గ్రెస్ యూత్ నాయకుడు పడిశెల శేఖర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నోముల భగత్ సమక్షంలో బీఆర్ఎస్లోకి చేరారు. పార్టీలో చేరిన వారు పడిశెల ప్రసాద్, గాదెపాక శ్రీనివాస్, మేదరి కొండలు, అవిరెండ్ల మనోజ్, శ్రీనివాస్, బుడిగి సైదులు, ఎర్రస్వాములు, పెదపంగ వెంకన్న, మహేష్, ప్రవీణ్, శ్రీకాంత్, నాగయ్య, ప్రశాంత్, సహదేవులు, అజ య్, దినేష్, నరేష్, ప్రభాస్, మహేందర్, రాజేష్, కా శయ్య, నాగరాజు, విజయ్, గ ణేష్, ఆనం ద్, నాగయ్య, శ్రీను, దుర్గయ్య, భిక్షం, రవితేజ ఉన్నారు. నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, తిరుమలగిరి ఎంపీపీ భగవాన్‌నాయక్, త్రిపురారం గ్రా మ అధ్యక్షుడు జం గిలి శ్రీనివాస్, కలకొండ వెంకటేశ్వర్లు, కృష్ణ పాల్గొన్నారు.
హాలియా: దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పా ర్టీలు దొందు దొందేనని ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై గుర్రంపోడు మండలం పాల్వాయి, మైల పురం గ్రామానికి చెందిన ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు తల్లోజు సాల్వాచారి, గుర్రంపోడు మాజీ అధ్యక్షుడు అందుగుల ఏడుకొండలు మంగళవారం హాలియాలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మె ల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ రాంచందర్‌నాయక్, బీఆర్ ఎస్‌లోకి చేరారు. వారికి గులాబీ కండు వాలు కప్పి ఎమ్మెల్యే బీఆర్ఎస్లోకి ఆహ్వా నించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవల్లి విజయేం దర్‌రెడ్డి, ఎంపీపీలు మంచుకంటి వెంకటే శ్వర్లు, అంగోతు భగవాన్‌నాయక్, రామ గిరి చంద్రశేఖర్, బాబురావునాయక్, అల్లి పెద్దిరాజు, రమణరాజు తదితరులున్నారు.