తుంగతుర్తి, జూన్ 02 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకు వస్తున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల (రివ్యాంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కిం) ప్రీ.పెయిడ్ మీటర్ల విధానంతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షులు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల తర్వాత రైతులను అన్ని రకాలుగా మోసం చేస్తుందని మోటార్లకు మీటర్లు పెడతారని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అప్పుడే చెప్పారన్నారు. నరేంద్ర మోదీ ముందు చూపులేని నిర్ణయాలతో రైతులు ఆర్థికంగా నష్టపోతారని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ స్కీమును అమలు చేయాని ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
ఈ విధానం వలన లక్షలాది మంది రైతాంగానికి విద్యుత్ అనేది గుదిబండగా మారనుందని వ్యవసాయానికి విద్యుత్ మోటార్ కనెక్షన్ కోసం ఇప్పుడొస్తున్న ప్రభుత్వ సబ్సిడి పూర్తిగా ఎత్తి వేసి మొత్తం అయ్యే ఖర్చు రైతు నెత్తిన మోపబడుతుందని అన్నారు. ఉచిత విద్యుత్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పకనే రద్దు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వాలు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్ , సర్పంచులు తప్పెట్ల ఎల్లయ్య, కుంచాల శ్రీనివాసరెడ్డి, పోలేపాక వెంకటమ్మ కర్ణాకర్, మెదడుల రమేష్ , బీఆర్ఎస్ నాయకులు సింహాద్రి, వెంకట్, రాములు, రవి నాయక్, భగవాన్, వెంకట్ నర్సు, రాములు, జానీ శంకర్, నాగయ్య, బర్ల సోమన్న, దశరథ, శ్రీను, గోపాల్, గునిగంటి యాదగిరి, గోపగాని శ్రీనివాస్, తడకమళ్ళ రవి కుమార్, మల్లేష్, సాయి కిరణ్, వెంకటేష్, మధు పాల్గొన్నారు.