అరవయ్యేండ్ల పాలనలో కాంగ్రెస్ నాయకులు అందినకాడికి దోచుకున్నారే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, గ్యారెంటీల పేరు చెప్పి ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. తుర్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ కాంగ్రెస్ 24 గంటల కరెంట్ వద్దంటున్నద్దని, ధరణిని ఎత్తివేస్తామంటున్నదని, ఆ పార్టీకి ఓటేస్తే రైతు బతుకులు ఆగమేనని అన్నారు.
నియోజకవర్గ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తుర్కపల్లిలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
తుర్కపల్లి, నవంబర్ 24 : కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే రాష్ట్రం అంధకారమవుతుందని ఆలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని మల్కాపురం, పల్లెపహడ్, రుస్తాపురం, రాంపురం, కడీలబాయి, ముల్కలపల్లి, గంగారంతండా, బోజ్యాతండా, కిమ్యాతండా, తిరుమలాపురం, మంచిరొణిమామిళ్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఒక అవకాశం ఇవ్వండి అని గ్రామాల్లోకి వస్తున్నారని.. 60ఏండ్లు అవకాశం ఇస్తే అందినకాడికి దోచుకున్నారే తప్ప ప్రజలకు ఓరగబెట్టిందేమీ లేదన్నారు.
గ్యారెంటీల పేరు చెప్పి ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని, కర్ణాటక ప్రజలను మోసం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. 24 గంటల ఉచిత కరెంట్‌తో సంతోషంగా ఉన్న రైతులు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పంటలను ఎండపెట్టి వలసబాట పట్టాల్సి వస్తదన్నారు. ధరణిని ఎత్తేసి రైతుల మధ్య భూ తగాదాలను పెట్టాలని చూస్తుందన్నారు.
నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తుర్కపల్లిలో 138 ఎకరాల్లో గ్రీన్ ఇండర్స్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల అనంతరం పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. 10 ఏండ్ల క్రితం ఏడారిగా మారిన ప్రాంతాన్ని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాలకు కాళేశ్వరం జలాలను తెచ్చి సస్యశ్యామలం చేస్తామన్నారు. మరోసారి ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం మహిళలతో బతుకమ్మ ఆడారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్ ధనావత్ బీకునాయక్, ఎంపీపీ బూక్యా సుశీలారవీందర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నర్సింహారెడ్డి, సెక్రటరీ జనరల్ శ్యాగర్ల పరమేశ్, సర్పంచులు ప్రభాకర్‌రెడ్డి, నామసాని సత్యనారాయణ, ఇమ్మడి మల్లప్ప, వంకరి లావణ్య, అమలాబాలకృష్ణ, లలితాశ్రీనివాస్, ఎంపీటీసీ గిద్దె కర్ణాకర్, మండల మహిళాధ్యక్షురాలు శోభ, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు ర్యాకల రమేశ్‌యాదవ్, సోషల్ మీడియా నియోజకవర్గ, మండల కన్వీనర్లు నల్ల శ్రీకాం త్, ఐలేశ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మోతీరాం, వెంకటేశ్, బంజార సేవ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బూక్యా రవీందర్, మాజీ ఎంపీపీ బొరెడ్డి రాంరెడ్డి, కర్ణాకర్‌రెడ్డి, భాస్కర్‌నాయక్ పాల్గొన్నారు.