సూర్యాపేట టౌన్, మార్చి 20 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి సూర్యాపేట పట్టణంలోని అన్ని వార్డుల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివెళ్లారు. జిల్లా కేంద్రంలోని 45వ వార్డులో జిల్లా నాయకుడు గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో సమావేశానికి భారీ ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతుందన్నారు.
రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ ఉద్యమ కార్యచరణ రూపొందిస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెద్దింటి కృష్ణారెడ్డి, ముత్యాల అనిల్, కుక్కడపు భిక్షం, సందీప్, వేణు, కార్తీక్, పందిరి జానయ్య, చిలువేరు సంతోష్, కొలిశెట్టి సుమన్, బి.వి.రెడ్డి, పవన్, లింగరాజు, రమేశ్, రవ్వ రాంబాబు, వర్షిత, బురెడ్డి కృష్ణారెడ్డి, అఫ్జల్ పాల్గొన్నారు.