ఆత్మకూర్.ఎస్, మే 18 : పెళ్లి సమయంలో పసుపు కుంకుమల కింద ఇచ్చిన మూడు గుంటల భూమి విషయంలో అక్క సురభి అంజమ్మ (50) అడ్డు వస్తోందని తమ్ముడు సురభి సైదులు కొడవలితో అక్కను దారుణంగా హత్య చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల తుమ్మలపెన్‌పహాడ్‌లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం గ్రామానికి చెందిన సురభి బుచ్చయ్య లక్ష్మమ్మకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె అంజమ్మకు(మృతురాలు) 30 ఏండ్ల క్రితం వివాహమైంది. అనంతరం ఆమె భర్తకు దూరంగా ఉం టూ తుమ్మలపెన్‌పహాడ్‌లో తల్లి వద్దే ఉంటోంది. చిన్న కుమార్తె ఉమకు 20 ఏండ్ల క్రితం కోదాడకు చెందిన వ్యక్తి తో వివాహమైంది.
ఆ సమయంలో ఉమకు తండ్రి బుచ్చయ్య పసుపు కుంకుమ కింద రెండెకరాల భూమి రాసిచ్చాడు. భూమిని పట్టా చేసే సమయంలో మూడు గుంటల భూమి ఉమకు ఎక్కువ పట్టా కావడంతో ఆమెకు అన్న సైదులుతో వివాదం ఏర్పడింది. పలుమార్లు పెద్దల సమక్షంలో పోలీస్టేషన్ వద్ద పంచాయితీ అయినప్పటికీ వివాదం తేలలేదు. ఉమ తరచుగా తన అక్క అంజమ్మ ఇంటికి వస్తూ వెళుతూ ఉండేది. తన అక్క కారణంగా చెల్లితో భూమి విషయంలో వివాదం వస్తోందని కక్ష పెంచుకున్న సైదులు సోమవారం తెల్లవారు జామున తన ఇంటి ముం దు నుంచి ఉపాధి పనికి వెళ్తున్న అక్క అంజమ్మపై ఒక్కసారిగా కత్తితో మెడ, ముఖం, ఛాతిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.
ఈ దాడి లో తీవ్రంగా గాయపడిన అంజమ్మ ను చుట్టు పక్కల వారు దవాఖానకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చెల్లెలు ఉమ ఫిర్యా దు మేరకు అన్న సురభి సైదులుపై, హత్యకు ప్రేరేపించిన మరి కొందరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ దస్తగిరి తెలిపారు. మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా దవాఖానకు తరలించి పోస్టుమార్టం చేపట్టినట్లు తెలిపారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్సీ నర్సింహ సందర్శించారు. క్లూస్ టీం, డాగ్ స్కాడ్‌తో హత్య జరిగిన స్థలా న్ని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడుతూ భూ వివాదాలు ఉంటే చట్టాలు, కోర్టుల ద్వారా పరిష్కరించుకోవాలే తప్ప కక్షలు పెంచుకొని దాడులు, హత్యలకు పాల్పడవద్దని ఎస్పీ సూచించారు. ఆయన వెంట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ మహేశ్, గోపికృష్ణ, పోలీసు సిబ్బంది ఉన్నారు.