కట్టంగూర్, ఆగస్టు 02 : తల్లి పాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివారం మండల కేంద్రంలోని అంబటివాగులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు పట్టించాలని, అప్పుడే వచ్చే ముర్రుపాలలో బలవర్ధకమైన స్యూట్రీషియన్లు, ప్రోటీన్లు ఉంటాయన్నారు. తల్లిపాల వల్ల భవిష్యత్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ స్వరూపరాణి, అంగన్వాడీ సూపర్వైజర్ శారదారాణి, ఏఎన్ఎం వరలక్ష్మి, అంగన్వాడీ టీచర్ సైదమ్మ, బాలింతలు, గర్భిణులు పాల్గొన్నారు.