కోదాడ, ఆగస్టు 14 : కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ జన్మదిన వేడుకలను గురువారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కోదాడలోని మల్లయ్య యాదవ్ నివాసంలో పార్టీ పట్టణాధ్యక్షుడు ఎస్కే నయీం, సీనియర్ నాయకుడు పైడిమర్రి సత్యబాబు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తన ఐదు సంవత్సరాల పాలన కాలంలో నియోజకవర్గంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని, అకాల వరదలు వచ్చిన సందర్భంలోనూ ప్రత్యక్షంగా బాధితులను ఆదుకున్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచేందుకు కృషి చేస్తామన్నారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు మాజీ ఎమ్మెల్యేకు వెన్నుదన్నుగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుక్కడపు బాబు, కర్ల సుందర్ బాబు, గోపాల్, భాగ్యమ్మ, లలిత, చంద్రశేఖర్, మామిడి రామారావు, వెంకట్, ఉపేందర్ గౌడ్, భూపాల్ రెడ్డి, జానకి, రామాచారి, తొగరు రమేశ్, సురేశ్ నాయుడు, జానీ, కలీం, రాజేశ్, శ్రీధర్, క్రాంతి, శంకర్ పాల్గొన్నారు.