దేవరకొండ : బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలో ఆయన మాట్లాడుతూ..అక్రమ అరెస్టులకు భయపడేదే లేదు అని ఆయన అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కేటీఆర్‌పై అసత్య ప్రచారం చేసిన మహా టీవీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ చంద్రబాబు నాయుడు హైరానా చేస్తున్నారని మండిపడ్డారు. మహా టీవీ యాజమాన్యం కేటీఆర్ పై వ్యక్తిగతంగా ఆరోపణలు చేసిందని విమర్శించారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.